HD Kumaraswamy : మోదీ కామెంట్స్ కుమారస్వామి సీరియస్
బీజేపీకి వంశ పారంపర్య పార్టీల సపోర్ట్
HD Kumaraswamy : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వంశ పారంపర్య పార్టీలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్బంగా కర్ణాటక మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి(HD Kumaraswamy) సంచలన కామెంట్స్ చేశారు.
ప్రధానిపై నిప్పులు చెరిగారు. ఒకే వ్యక్తికి ఒకే పదవి అని పైకి చెబుతున్న ప్రధానమంత్రి తన పార్టీలో, పదవుల్లో ఎంత మంది నాయకులు, వారి పిల్లలు పదవులు అనుభవించడం లేదని ప్రశ్నించారు.
ఆయన ఉదాహరణగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆయన కుమారుడు జే షా బీసీసీఐ కార్యదర్శిగా పెత్తనం చెలాయించడాన్ని ఎత్తి చూపారు.
ఇదిలా ఉండగా వంశ పారంపర్య పార్టీల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందంటూ మోదీ తాజాగా హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు కుమార స్వామి. ఇప్పటి వరకు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో వంశ పారంపర్య పార్టీలు లేవా, లేక మోదీకి ఇప్పటి దాకా కనిపించ లేదా అంటూ ప్రశ్నించారు.
ఆయా పార్టీల కుటుంబ పాలన వల్ల దేశంలోని యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావడం లేదంటూ పేర్కొనడాన్ని తప్పు పట్టారు. 1990లో తన తండ్రి హెచ్ డి దేవెగౌడ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు.
కుమార స్వామి(HD Kumaraswamy) కర్ణాటకకు సీఎంగా పని చేశారు. మోదీ పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఆయన తగిన సమాచారం తెలుసు కోకుండానే మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు మాజీ సీఎం.
Also Read : తమిళ భాషను జాతీయ భాషగా గుర్తించాలి