Anurag Thakur : జెండా ఎగరేసినందుకు జైల్లో పెట్టారు
ప్రకటించిన కేంద్ర మంత్రి ఠాకూర్
Anurag Thakur : కేంద్ర క్రీడా, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఒకసారి జాతీయ జెండా (త్రివర్ణ పతాకం ) ఎగుర వేసినందుకు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు మంత్రి. కానీ 2019 ఆగస్టు తర్వాత , ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం భూభాగంలో అలాంటి ఆంక్షలు లేనే లేకుండా పోయాయని స్పష్టం చేశారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).
గతంలో జెండా ఎగుర వేయాలంటే నానా ఇబ్బందులు ఉండేవన్నారు. అంతే కాదు జాతీయ జెండాను జమ్మూ కాశ్మీర్ లో ఒకసారి ఎగుర వేసినందుకు జైలుకు కూడా వెళ్లారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మోదీ ప్రభుత్వం వచ్చాక ఉగ్రవాదుల ఆటలు సాగడం లేదన్నారు. దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న, వ్యవహరిస్తున్న వారందరినీ ఏకి పారేస్తున్నారని దీంతో సాధ్యమైనంత వరకు ఉగ్రవాదం అన్నది లేకుండా పోయిందన్నారు అనురాగ్ ఠాకూర్.
నేను 2010 నుండి 2017 వరకు బీజేపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా ఎక్కువ కాలం పని చేశానని అన్నారు. జాతీయ జెండాను ఎగుర వేసేందుకు కోల్ కతా నుంచి కాశ్మీర్ దాకా యాత్ర చేపట్టానని చెప్పారు.
ఆనాడు భారతీయ మువ్వొన్నెల జెండాను ఎగుర వేసినందుకు నన్ను జైల్లో పెట్టారంటూ మండిపడ్డారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). ఈ షాకింగ్ కామెంట్స్ ను ఐఐటీ గౌహతిలో జీ20 ఇండియా ఆధ్వర్యంలో జరిగిన మొదటి వై20 సమావేశంలో చేశారు.
జీ20 ఇండియా ఆధ్వర్యంలో 2023లో మొదటి వై20 సమావేశం గౌహతిలో ప్రారంభం కావడం విశేషం.
Also Read : రాహుల్ పై చర్య తీసుకోవాలి