PM Modi : ఆరోగ్యానికి..ఆధ్యాత్మిక‌త‌కు దేశం ఆల‌వాలం

ఫ‌రీదాబాద్ లో అతి పెద్ద ఆస్ప‌త్రి స్టార్ట్

PM Modi : ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక‌త‌కు భార‌త దేశం కొలువై ఉంద‌ని పేర్కొన్నారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi). బుధ‌వారం హ‌ర్యానా లోని ఫ‌రీదాబాద్ లో అతి పెద్ద ఆస్ప‌త్రిని ప్రారంభించారు.

మాతా అమృతానంద‌మ‌యి మ‌ఠం స‌హ‌కారంతో ఆరు సంవ‌త్స‌రాల కాలంలో అత్యాధునిక అమృత ఆస్ప‌త్రిని నిర్మించారు. కేంద్రీకృత పూర్తి ఆటోమేటెడ్ లేబొరేట‌రీతో స‌హా అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన 2,600 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మోదీ ప్ర‌సంగించారు. భార‌త దేశం ఆరోగ్య సంక్ష‌ర‌ణ , ఆధ్యాత్మిక‌త‌కు ద‌గ్గ‌రి సంబంధం ఉంద‌న్నారు. క‌రోనా అనేది విజ‌య‌వంత‌మైన ఆధ్యాత్మిక‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యానికి స‌రైన ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.

అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో, ప్ర‌పంచంలోనే అతి పెద్ద టీకా డ్రైవ్ ను అమ‌లు చేయ‌డంలో స‌హాయ ప‌డింద‌ని చెప్పారు మోదీ. ఈ సాంకేతిక‌త‌, ఆధునీక‌ర‌ణ క‌ల‌యిక ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగంలో దేశం పురోగ‌తికి దారి తీస్తుంద‌న్నారు.

ఆరోగ్య‌, విద్యా రంగాల‌ను ఒక మిష‌న్ మోడ్ లో మార్చేందుకు ప్ర‌భుత్వాలు, ఇత‌రులు ముందుకు వ‌చ్చేలా భార‌త దేశం కృషి చేస్తోంద‌న్నారు ప్ర‌ధాన మంత్రి.

130 ఎక‌రాల విస్తీర్ణంలో విశాల‌మైన క్యాంపస్ లో నిర్మించిన అత్యాధునిక అమృత హాస్పిట‌ల్. 7 అంత‌స్తుల ప‌రిశోధ‌నా బ్లాకును క‌లిగి ఉంది. కొత్త సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి 500 ప‌డ‌క‌ల‌తో ప్రారంభించారు.

రాబోయే ఐదేళ్ల‌లో ద‌శ‌ల వారీగా పూర్తి స్థాయిలో ప‌ని చేస్తుంద‌ని భావిస్తున్నారు. ఆస్ప‌త్రి భ‌వ‌నాలు 36 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 14 అంత‌స్తుల ట‌వ‌ర్ కూడా క‌లిగి ఉంది. క్యాంప‌స్ లో వైద్య క‌ళాశాల కూడా ఉంది.

Also Read : మోదీ ప్లాన్..అదానీ ఎన్డీటీవీ కొనుగోలు

Leave A Reply

Your Email Id will not be published!