Heavy Rain Hyderabad : భారీ వర్షం అతలాకుతలం
కొట్టుకు పోయిన వాహనాలు
Heavy Rain Hyderabad : భారీ వర్షం తాకిడికి భాగ్యనగరం వణికి పోయింది. ఎక్కడ చూసినా నీళ్లు దర్శనమిచ్చాయి. చాలా చోట్ల వాహనాలు కొట్టుకు పోయాయి. హైదరాబాద్(Heavy Rain Hyderabad) లో శనివారం కురిసిన వర్షం తీవ్ర ఇబ్బందులను కలుగ చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు నానా తంటాలు పడ్డారు. ఎడ తెరిపి లేకుండా గంటకు పైగా వర్షం ధాటిగా కురిసింది. దీంతో నాలాలు పొంగి పొర్లాయి.
పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులు, ఈదర గాలులతో మొదలైన వాన ఉలిక్కి పడేలా చేసింది నగర వాసులను. ఇప్పటికే రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించినా హైదరాబాద్ నగర పాలక సంస్థ అంతగా ఫోకస్ పెట్టలేదంటూ నగర వాసులు వాపోయారు. నాలాలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ నిర్వాకం కారణంగా ఇలా జరిగిందని ఆవేదన చెందారు.
భారీ వర్షం కారణంగా రాజేంద్ర నగర్, చార్మినార్ , సరూర్ నగర్ , ఎల్బీ నగర్ , హయత్ నగర్ , హిమాయత్ నగర్ , విద్యా నగర్ , కూకట్ పల్లి ఇలా ప్రతి చోటా వర్షం(Heavy Rain Hyderabad) దంచి కొట్టింది. రోడ్లన్నీ నీళ్లతో నిండి పోయాయి. మరో వైపు హైటెక్ సిటీ, బాచుపల్లి, మియా పూర్ , పటాన్ చెరు, చందా నగర్ తదితర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచి పోయింది. పలు చోట్ల ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Also Read : మన్ కీ బాత్ కి బిల్ గేట్స్ ఫిదా