Heavy Rain : రాబోయే మూడు రోజులు వ‌ర్షాలు

వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక

Heavy Rain : బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప‌పీడ‌నం కార‌ణంగా గ‌త కొన్ని రోజులుగా ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులు మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయంటూ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్త‌రు వ‌ర్షాలు వ‌ర్షాలు కురుస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

Heavy Rain Issue

ఇవాల్టి నుండి వ‌ర్షాలు(Rains) కుండ‌పోత‌గా కుర‌వ‌నున్నాయ‌ని వెల్ల‌డించింది. కొన్ని జిల్లాల‌లో ఆరెంజ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. 25, 26, 27 తేదీల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. కొన్నిచోట్ల , భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు వ‌స్తాయ‌ని తెలిపింది వాతావ‌ర‌ణ శాఖ‌.

ఉరుములు, మెరుపుల‌తో పాటు ఈదురు గాలులు, గాలి వేగంతో గంట‌కు 40 నుండి 50 కిలోమీట‌ర్ల వేగంతో వీచే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. మ‌రో వైపు ఏపీలో సైతం భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. మ‌త్స్య కారులు చేప‌ల వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని సూచించింది.

ఇదిలా ఉండ‌గా వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మత్త‌మైంది. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : Revanth Reddy : మామా అల్లుళ్లు అవ‌కాశ‌వాదులు – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!