Heavy Rain Tirumala : తిరుమలలో భారీ వర్షం
భక్తులకు తీవ్ర ఇబ్బందులు
Heavy Rain Tirumala : తిరుమలలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారి పోయింది. అనుకోకుండా భారీ వర్షం కురిసింది. పైగా వడగండ్ల వాన కురియడంతో సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా వచ్చిన వర్షం తాకిడికి తల్లడిల్లారు. భక్తులు షెడ్ల వద్దకు పరుగులు తీశారు. భారీగా ఉరుములు, మెరుపులు కురిశాయి. చిన్నారులు, వృద్దులు భయంతో వణికి పోయారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి చాలా వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ఇటీవలి కాలంలో తిరుమలలో(Heavy Rain Tirumala) ఇంత పెద్ద ఎత్తున వర్షం పడడంతో మొదటిసారి. చాలా సేపు పడుతూ ఉండడంతో భక్తులు నానా తంటాలు పడ్డారు. వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలలో ఉన్న దుకాణాల్లోకి చేరుకుంది. వస్తువులన్నీ తడిసి పోయాయి.
మరో వైపు భారీ వర్షం కారణంగా ఆయా ఘాట్ రోడ్ల వద్ద కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించింది. ద్విచక్ర వాహనారులు, నడిచి వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏమైనా జరిగినా లేదా ఏ అవసరం కావాలన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని కోరింది.
ఇక ఎప్పటి లాగే తిరుమలకు భక్తులు పోటెత్దారు. రోజు రోజుకు భక్తులు పెరుగుతున్నారే తప్పా తగ్గడం లేదు. శ్రమకోర్చి స్వామి దర్శనం కోసం వచ్చే భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
Also Read : తెలంగాణ గురుకులాల్లో పోస్టులు ఇవే