Heavy Rains AP : భారీ వర్షం ఏపీ అస్తవ్యస్తం
గోదావరి, కృష్ణా నదులకు వరద ఉధృతి
Heavy Rains AP : బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండి పోయాయి. పలు చోట్ల గండ్లు పడ్డాయి. రహదారుల పైకి నీళ్లు వచ్చి చేరాయి. రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పెద్ద ఎత్తున వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.
Heavy Rains AP Continues
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) తాకిడికి మునేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి వరద నీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ కు 40 గేట్లు రెండు అడుగులు , 30 గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తి వేశారు అధికారులు. 80,000 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో నదీ తీర దిగువ ప్రాంతంలో నివసించే వారిని అప్రమత్తం చేశారు.
వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాక పోకలు నిలిచి పోయాయి. తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరో వైపు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. 50 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను గోదావరి చుట్టు ముట్టింది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Also Read : India MP’s Protest : మణిపూర్ హింసపై ఎంపీల నిరసన