Heavy Rains AP Telangana : భారీ వర్షం జర భద్రం
ఏపీ, తెలంగాణలో వర్షాలు
Heavy Rains AP Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వణికిస్తోంది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి జన జీవనం స్తంభించి పోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఏపీ సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టింది. మరో రెండు మూడు రోజులు వేటకు వెళ్లే మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
కుండ పోతగా కురుస్తున్న వర్షాల ధాటికి కాలువలు, కుంటలు, చెరువులు, ఎత్తి పోతల పథకాలు, ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపింప చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దంచి కొట్టిన వానలు కొంత మేర తగ్గినట్టు అనిపించినా తిరిగి తేలిక పాటి జల్లులతో పాటు ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) హెచ్చరించింది.
ఎప్పుడైనా వర్షాలు కురుస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏపీలో దంచి కొడుతున్న వానలకు గోదావరికి వరద నీరు భారీగా చేరుతోంది. ఇక తెలంగాణలో కాళేశ్వరంకు కూడా నీళ్లు చేరాయి. తెలంగాణ వ్యాప్తంగా జోరందుకుంది వాన.
Heavy Rains AP Telangana & Many districts
మేడ్చల్ , హైదరాబాద్ , మహబూబ్ నగర్ , నారాయణపేట, మెదక్ , సంగా రెడ్డి, వికారాబాద్ , రంగారెడ్డి, సిద్దిపేట , జనగాం, వరంగల్ , హన్మకొండ , ఆసిఫాబాద్ , భూపాలపల్లి, కొమురం భీమ్ , మంచిర్యాల జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక కామారెడ్డి, సూర్యాపేట, మహబూబాబాద్ , నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ లలో వర్షం తాకిడి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కాళేశ్వరం , మేడిగడ్డ నిండి పోయాయి. కిందకు నీళ్లను విడిచారు.
Also Read : Tirumala Rush : తిరుమలలో 70 వేల పైగా భక్తుల రద్దీ