Heavy Rains Telangana : తెలంగాణకు వాన గండం తప్పదు కష్టం
అప్రమత్తంగా ఉండాలన్న సర్కార్
Heavy Rains Telangana : ఇప్పటికే వర్షాల దెబ్బకు తెలంగాణ వణుకుతోంది(Heavy Rains Telangana). తాజాగా మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ.
తేలిక పాటి నుండి మోస్తరుగా వర్షాలు కురుస్తామని సూచించింది. ఈ సందర్బంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న గురువారం కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్ర మంతటా పశ్చిమ, నైరుతి వాయుగుండం ఉందన్నారు. దీంతో రాబోయే నాలుగైదు రోజుల్లో భారీగా వర్షాలు కురవనున్నాయని వెల్లడించారు.
ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉష్ణోగ్రతలు 35 నుండి 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందే గ్రహించిన సీఎస్ అప్రమత్తం అయ్యారు.
ఈ మేరకు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్(Heavy Rains Telangana) ఆరా తీశారు. అన్ని జిల్లాలను అలర్ట్ చేయాలని, ఎక్కడా ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎస్ ను ఆదేశించారు.
భారీ వర్షాల దెబ్బకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తనకు చేరవేయాలని అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
జూరాల, శ్రీరాంసాగర్ నిండు కుండలా మారాయి. ఎక్కువ నీళ్లు రావడంతో దిగువకు వదులుతున్నారు. ప్రజలు అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది సర్కార్.
ప్రభుత్వం ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఇప్పటికే దసరా సందర్భంగా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ముందస్తుగా ఇళ్లల్లోకి వెళ్లడమే బెటర్ అంటున్నారు జనం.
Also Read : అందనంత దూరంలో అదానీ