Chennai Rain : చెన్నైని ముంచెత్తిన వ‌ర్షం బ‌డులు బంద్

నీట మునిగిన లోత‌ట్టు ప్రాంతాలు

Chennai Rain : త‌మిళ‌నాడును వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా గురువారం రాత్రి భారీ ఎత్తున వ‌ర్షం కురిసింది(Chennai Rain). దీంతో రాజ‌ధాని న‌గ‌రం చెన్న ప‌ట్ట‌ణం పూర్తిగా నీళ్ల‌తో నిండి పోయింది. ప‌లు చోట్ల ట్రాఫిక్ కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి ముందు జాగ్ర‌త్త‌గా రాష్ట్ర డీఎంకే ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.

ఈ మేర‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ వ‌ర్షాలు, చోటు చేసుకున్న ప‌రిస్తితుల‌పై ఆరా తీశారు. స‌హాయ‌క ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు బ‌డుల‌ను మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌ల్లో మునిగింది.

చెన్నై లోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఈ త‌రుణంలో పాఠ‌శాల‌లు, కాలేజీలు, ఇత‌ర విద్యా సంస్థ‌ల‌ను మూసి వేయాల‌ని ఆదేశించింది. తాజాగు వాతావ‌ర‌ణ కేంద్రం మ‌రోసారి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. భారీ వ‌ర్షాలు(Chennai Rain) కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన‌డంతో ముంద‌స్తుగా 5,093 స‌హాయ శిబిరాల‌ను ఏర్పాటు చేశారు ఉన్న‌తాధికారులు.

వ‌ర్షం తాకిడికి ఉత్త‌ర చెన్నై లోని పులియంతోప్ ప్రాంతంలోని ర‌హ‌దారులు నీట మునిగాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో శుక్ర‌వారం వ‌ర‌ద నీరు ఉలిచి ఉండ‌డంతో త‌మిళ‌నాడు, పుదుచ్చేరి లోని 14 జిల్లాల్లో పాఠ‌శాల‌లు, కాలేజీలు మూత ప‌డ్డాయి.

ఒక్క చెన్నైలోనే 169 శిబిరాలు ఏర్పాటు చేయ‌గా మిగ‌తా ప్రాంతాల్లో భారీ ఎత్తున స‌హాయ శిబిరాల‌ను ఏర్పాటు చేయ‌డం విశేషం. ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించింది ప్ర‌భుత్వం.

Also Read : మోదీ పాల‌న‌లో అన‌కొండ‌లా అవినీతి – హ‌జారే

Leave A Reply

Your Email Id will not be published!