Heavy Rains : హ‌మ్మ‌య్య కురిసిన వ‌ర్షం

హైద‌రాబాద్ తో పాటు ప‌లు చోట్ల వ‌ర్షం

Heavy Rains  : నిన్న‌టి దాకా రుతు ప‌వ‌నాలు ఎప్పుడు వ‌స్తాయోనని వేచి చూసిన జ‌నాల‌కు కొంత ఊర‌ట‌నిచ్చేలా క‌రుణించాయి. ఇటు ఏపీలో అటు తెలంగాణ‌లో కొన్నిచోట్ల వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైద‌రాబాద్ లో అర్ధ‌రాత్రి నుంచి భారీ వ‌ర్షం కురిసింది. దీంతో చినుకు ప‌డితే చాలు రోడ్ల మీద‌కు నీళ్లు వ‌స్తున్నాయి న‌గ‌రంలో. చాలా చోట్ల నీళ్లతో నిండి పోయాయి.

ఇక గ్రేట్ వ‌రంగ‌ల్ లో భారీ వ‌ర్షం కురిసింది. రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. ఉమ్మ‌డి ఆదిలాబాద్ , మెదక్ ఇల్లాల్లో సైతం ధాటిగా వ‌ర్షం కురిసింది. ఏపీలో సైతం ప‌లు జిల్లాల‌ను వ‌ర్షాలు(Rains) ప‌ల‌క‌రించాయి. అక్క‌డ‌క్క‌డా భారీ నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

ఏపీ వాతావ‌ర‌ణ శాఖ డైరెక్ట‌ర్ అంబేద్క‌ర్ సూచ‌న‌ల ప్ర‌కారం ముందు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. దీంతో ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యింది. ఉరుముల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, రాబోయే మూడు రోజులు అప్ర‌మ‌త్తంగా ఉండాలని హెచ్చ‌రించారు. దీంతో పొలాల్లో ప‌ని చేసే రైతులు, కార్మికుల‌తో పాటు మ‌త్స్య కారులు చేపల వేట‌కు వెళ్ల వ‌ద్ద‌ని సూచించారు.

ఇప్ప‌టికే వ‌ర్షాలు కురిసి కాలువ‌లు, ప్రాజెక్టులు, చెరువులు నిండాల్సి ఉండ‌గా వ‌ర్ష‌పు జాడ లేక పోవ‌డంతో చాలా చోట్ల రైతులు , ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పూజ‌లు చేశారు. వారి పూజ‌లు ఫ‌లించ‌డంతో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షపు చినుకులు కురుస్తున్నాయ‌ని గ్రామ‌స్తులు న‌మ్ముతున్నారు.

Also Read : Scotland Win : వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి జింబాబ్వే ఔట్

 

Leave A Reply

Your Email Id will not be published!