Heavy Rains Mumbai : భారీ వర్షం ముంబై అతలాకుతలం
రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
Heavy Rains Mumbai : దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాల దెబ్బకు(Heavy Rains Mumbai) తల్లడిల్లుతోంది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి నగరం వణుకుతోంది. వందలాది మందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఎక్కడికక్కడ రవాణా స్తంభించి పోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు రైళ్లను నిలిపి వేశారు.
మొన్నటి నుంచి ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం రంగంలోకి దిగింది.
సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించింది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు.
వాతావరణ శాఖ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ముందస్తుగానే హెచ్చరించింది. దీంతో సర్కార్ అప్రమత్తమైంది. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు బీచ్ లను సందర్శించకుండా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిషేధించింది. సోమ వారం నుంచి కుండ పోత వర్షం కురుస్తూనే ఉంది.
ముంబై, థానే, పాల్ఘర్ , రాయ్ గఢ్ , రత్నగిరి, సింధు దుర్గ్ లలో అలర్ట్ ప్రకటించారు. ద్వీప నగరం (దక్షిణ ముంబై)లో 82 మి.మీ వర్షపాతం నమోదైంది. పశ్చిమ శివారు ప్రాంతాల్లో వరుసగా 109 మిమీ , 106 మిమీ వర్షపాతం నమోదు కావడం విశేషం.
ఇక ట్రాక్ పై గోడ కూలడంతో సెంట్రల్ రైల్వే మార్గంలో లోకల్ సర్వీసు రైళ్లు నిలిచి పోయాయి.
Also Read : కన్నడ నాట ముంచెత్తిన వర్షం