Heavy Rains Mumbai : ముంబైని ముంచెత్తిన వ‌ర్షం

ప‌లు జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్

Heavy Rains Mumbai : నైరుతి రుతు ప‌వ‌నాల దెబ్బ‌కు కుండ పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌ధానంగా మ‌హారాష్ట్ర‌, తెలంగాణ రాష్ట్రాల‌ను వ‌ర్షాలు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి.

తాజాగా ముంబైని వ‌ర్షం(Heavy Rains Mumbai) ముంచెత్తింది. ముంబైతో పాటు శివారు ప్రాంతాల‌న్నీ నీళ్ల‌తో నిండి పోయాయి. ఇదిలా ఉండ‌గా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల దెబ్బ‌కు మ‌హారాష్ట్ర‌లోని ప‌లు జిల్లాల‌లో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.

ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నాయి. సెంట్ర‌ల్ రైల్వే, ప‌శ్చిమ రైల్వే కారిడార్ల‌లో లోక‌ల్ రైళ్లు య‌థావిధిగా న‌డుస్తున్నాయ‌ని రైల్వే అధికారులు వెల్ల‌డించారు.

కాగా లోత‌ట్టు ప్రాంతాలు వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇబ్బంది ఏర్ప‌డ‌డంతో రోజూ వారీగా తిరిగే బస్సుల‌ను వివిధ మార్గాల‌లో మ‌ళ్లించారు. కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి.

గోదావ‌రి పొంగి ప్ర‌వ‌హిస్తోంది. కాగా వ‌ర్షం కార‌ణంగా లోక‌ల్ రైళ్ల‌ను ఐదు నుంచి 10 నిమిషాలు న‌డుపుతున్న‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు.

అయితే రానున్న కొద్ది రోజుల్లో ముంబైలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

బుధ‌వారం వ‌రుస‌గా ఉద‌యం 11.44 నుంచి రాత్రి 11.38 గంట‌ల వ‌ర‌కు భారీగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ).

రాబోయే మూడు రోజుల పాటు పూణే, నాసిక్ , పాల్ఘ‌ర్ , గ‌డ్చిరోలి, నందుర్బార్, స‌తారా, లాతూర్, రాయ్ గ‌ఢ్ జిల్లాలో వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 13 బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి.

Also Read : ద్రౌప‌ది ముర్ముకు శివ‌సేన మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!