Heavy Rains Tamil Nadu : తమిళనాడును ముంచెత్తిన వర్షం
విద్యా సంస్థలకు సెలవులు
Heavy Rains Tamil Nadu : మరోసారి వర్షాలు ముంచెత్తాయి తమిళనాడును. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అకాల వర్షాల దెబ్బకు మరోసారి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాయి.
అల్పపీడనం ఏర్పడడంతో సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలన్నీ వర్షాలు తల్లడిల్లే చేస్తున్నాయి. తంజావూర్ జిల్లా పూర్తిగా తడి సి ముద్దైంది. దీంతో పిల్లలకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను బడులు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది జిల్లా ప్రభుత్వ యంత్రాంగం.
ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు. ముంపు బాధిత ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్కరు ఇబ్బంది పడకకుండా చూడాలని సూచించారు సీఎం. మరో వైపు రాష్ట్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
వర్షాల ప్రభావానికి(Heavy Rains) గురైన ప్రాంతాలలోని ప్రజలు ముందు జాగ్రత్తగా బయటకు రావద్దని కోరింది సర్కార్. తగు జాగ్రత్తలు వాడాలని , అవసరమైతే తప్ప వెళ్లవద్దని కోరింది. ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం సహాయం చేసేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు సీఎం ఎంకే స్టాలిన్ .
ఇప్పటికే పలుమార్లు భారీ వర్షాలు పెద్ద ఎత్తున కురిశాయి తమిళనాడును. గత ఏడాది 2022లో అతలాకుతలం చేశాయి. కోలుకోలేకుండా చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడింది ప్రభుత్వం. కానీ ఎక్కడా సాయం చేయడంలో వెనక్కి తగ్గలేదు.
Also Read : గాయని వాణీ జయరాం ఇక లేరు