Red Alert Tamil Nadu : ఆగని వర్షం తమిళనాడు అతలాకుతలం
వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వార్నింగ్
Red Alert Tamil Nadu : తమిళనాడును వర్షాలు వెంటాడుతున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తల్లడిల్లుతోంది. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు రోడ్లు జలమయం అయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది(Red Alert Tamil Nadu) . సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికే చెన్న పట్టణంతో పాటు 5 వేలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది.
తాజాగా మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో సీఎం ఎంకే స్టాలిన్ చోటు చేసుకున్న పరిస్థితులపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
కురుస్తున్న వర్షాల కారణంగా తిరువళ్లూరు, మధురై, శివగంగ, కాంచీపురం సహా పలు జిల్లాల్లో పాఠశాలలు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. మధురై, కాంచీపురం, త్రివళ్లూరులో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాలేజీలను కూడా మూసి వేయాలని ఆదేశించారు సీఎం ఎంకే స్టాలిన్.
ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఆదివారం ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైతే తప్పా ప్రజలు బయటకు రావద్దని కోరింది. తమిళనాడు లోని అనేక ఇతర ప్రాంతాలు ఇంకా వర్షం నుండి ఉపశమనం పొందలేదు.
దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తిరువళ్లూరు, మధురై, శివగంగ , కాంచీపురం సహా పలు జిల్లాల్లో బడులు మూసి వేశారు. దిండిగల్ , తేని, రామనాథపురం జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : కుల వ్యవస్థ దేశానికి అవస్థ – శశి థరూర్