Heavy Rain : చెన్న ప‌ట్ట‌ణం అస్త‌వ్య‌స్తం

తుపాను దెబ్బ‌కు వల‌వ‌ల‌

Heavy Rain : చెన్నై – బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడ‌నం వాయుగుండంగా మారింది. పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. త‌మిళ‌నాడు పూర్తిగా నీళ్ల‌లో చిక్కుకుంది. ఇక రాజ‌ధాని చెన్న ప‌ట్ట‌ణం (Chennai) చిగురుటాకులా వ‌ణుకుతోంది. నీట మునిగే స్థితిలోకి చేరుకుంది. వ‌ర‌ద‌లు న‌గ‌రాన్ని ముంచెత్తాయి. భారీ ఎత్తున కార్లు కొట్టుకు పోతున్నాయి. వాటిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసే ప‌రిస్థితి లేకుండా పోయింది.

Heavy Rain in Chennapatnam

చెన్నైకి 170 కిలోమీట‌ర్లు, నెల్లూరుకు 20 కి.మీ, బాప‌ట్ల‌కు 150 కిలోమీట‌ర్లు, మ‌చిలీప‌ట్నానికి 210కి కిలోమీట‌ర్ల దూరంలో తుపాను పొంచి ఉంది. తీరం వెంట గంట‌కు 90 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తున్నాయి.

కోస్తాంధ్ర‌లో చాలా చోట్ల తేలిక‌పాటి నుండి భారీగా వ‌ర్షాలు కుండ‌పోత‌గా కురుస్తున్నాయి. చాలా చోట్ల కొండ చ‌రియ‌లు విరిగి ప‌డ్డాయి. ర‌హ‌దారులపై నీళ్లు నిలిచాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ప‌లు చోట్ల భారీ నుండి, అతి భారీగా వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో చోటు చేసుకున్న వ‌ర‌ద తీవ్ర‌త‌పై ఆరా తీశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.

Also Read : Congress CM : తెలంగాణ సీఎం ఎంపిక‌పై స‌స్పెన్స్

Leave A Reply

Your Email Id will not be published!