Heavy Rains Telangana : జోరు వాన తడిసి ముద్దైన తెలంగాణ
నీళ్ల మధ్యన నిర్మల్ ..భైంసా
Heavy Rains Telangana : నైరుతి రుతుపవనాల దెబ్బకు వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాలను ముంచెత్తాయి. రహదారులపై నీళ్లు నిలిచాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇక రాష్ట వ్యాప్తంగా జోరుగా కురుస్తున్న వానల దెబ్బకు తెలంగాణ(Heavy Rains Telangana) తడిసి ముద్దైంది. ఇక నిర్మల్ జిల్లా పూర్తిగా నీళ్లతో నిండి పోయింది. భైంసా నీళ్ల మధ్యన నిలిచింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి.
పైన ఉన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేయడంతో పలు పట్టణాల్లోకి నీరు చేరింది. భైంసా లోని ఆటో నగర్ , వివేకానంద చౌక్ , పద్మావతి కాలనీ, ఎన్ఆర్ గార్డెన్ నీట మునిగాయి.
ఇక ఎన్ ఆర్ గార్డెన్ లో ఆరుగురు చిక్కుకు పోయారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు వారిని సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల తాకిడికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
భైంసా గడ్డెన్న ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నాలుగు గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మంత్రి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.
సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో 9 జిల్లాలలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ప్రభత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సీఎం కోరారు.
Also Read : భారీ వర్షం అ’భాగ్యనగరం’ అస్తవ్యస్తం