Heavy Rains Telangana : ఆగని వాన తల్లడిల్లుతున్న తెలంగాణ
ఆగని వర్షం తప్పని కష్టం అస్తవ్యస్తం
Heavy Rains Telangana : ప్రకృతి కన్నెర్ర చేసింది. తెలంగాణపై పగ బట్టింది. నైరుతి రుతుపవనాల దెబ్బకు భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు ఊళ్లకు సంబంధాలు తెగి పోయాయి.
ఇప్పటికే ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. తాజాగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలను వర్షాలు ముంచెత్తనున్నట్లు.
ఇప్పటికే కుండ పోత వర్షం దెబ్బకు జనం తల్లడిల్లుతున్నారు. ఆదిలాబాద్ , నిర్మల్, నిజామాబాద్ , ఆసిఫాబాద్ , పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలన్నీ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
మరో వైపు ఐదు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఇవే వర్షాల తాకిడి మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి.
గోదావరమ్మ ఉగ్ర రూపం దాల్చుతోంది. ప్రాణ హిత, పెన్ గంగా, వార్ధా నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టులు నిండాయి.
జూరాల నుంచి నీటిని దిగువన శ్రీశైలంకు వదిలారు. పలిమెల ఠాణా నీట మునిగింది. ప్రవాహం దెబ్బకు భద్రాచలం బ్రిడ్జిపై 48 గంటల పాటు రాక పోకలు నిలిపి వేశారు.
144 సెక్షన్ విధించారు. ఉన్న మూడు మార్గాలను మూసి వేశారు. గంట గంటకు గోదావరి పెరుగుతోంది. ఏపీ లోనూ గోదావరి వరద ఉధృతి పెరిగింది. ఆరు జిల్లాలపై ప్రభావం పడనుంది.
తెలంగాణ(Heavy Rains Telangana) వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎస్ పర్యవేక్షిస్తున్నారు.
Also Read : గోదావరి ఉగ్ర రూపం ఏపీ అప్రమత్తం