Heavy Rains Telangana : జ‌ల విల‌యం వ‌ర‌ద బీభ‌త్సం

క‌న్నీళ్ల‌ను మిగిల్చిన జోరు వాన

Heavy Rains Telangana : నైరుతి రుతుప‌వ‌నాల తాకిడికి తెలంగాణ(Heavy Rains Telangana) వ‌ణుకుతోంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. ఎక్క‌డ చూసినా నీళ్లే. ఊళ్ల‌కు ఊళ్ల మ‌ధ్య‌న సంబంధాలు తెగి పోయాయి.

గోదావ‌ర‌మ్మ ఉగ్ర రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఎగువ‌న మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్ గ‌ఢ్, ఒడిశా రాష్ట్రాల‌లో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల దెబ్బ‌కు జ‌నం కంట‌త‌డి పెడుతున్నారు. రాష్ట్రంలోని ప‌లు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి.

వాగులు, వంక‌లు ప్రమాద‌క‌ర స్థాయిని దాటి ప్ర‌వ‌హిస్తున్నాయి. గోదావ‌రి ఉగ్ర రూపం దాల్చ‌డంతో భ‌ద్రాచ‌లం, బూర్గంపాడులో 144వ సెక్ష‌న్ విధించారు. అంత‌కంత‌కు నీటి మ‌ట్టం పెరుగుతోంది.

బాస‌ర‌లో గోదావ‌ర‌మ్మ శాంతించాలంటూ పూజ‌లు చేశారు. కానీ వారి పూజ‌లు ఫ‌లించ లేదు. లోత‌ట్టు ప్రాంతాల‌లో చిక్కుకున్న వారిని స‌హాయ శిబిరాల‌కు త‌ర‌లించారు.

ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్ , ఖ‌మ్మం, నిజామాబాద్ , నిర్మ‌ల్ , జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి , త‌దిత‌ర జిల్లాల‌న్నీ నీళ్ల‌తో నిండి పోయాయి.

ఎల్లంప‌ల్లి దిగువ నుంచి భ‌ద్రాచ‌లం దాకా ప‌లు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం గోదావరీ ప‌రీవాహ‌క ప్రాంతాన్ని రెడ్ అల‌ర్ట్ జోన్ గా ప్ర‌క‌టించింది.

ఇక రామ‌గుండం, మంచిర్యాల‌, మంథ‌ని ప‌ట్ట‌ణాలు నీట మునిగాయి. ఇక భ‌ద్రాచ‌లం జ‌ల దిగ్భంధంలో చిక్కుకుంది. ఇక కొమురం భీం ఆసిఫా బాద్ , పెద్ద‌ప‌ల్లి , క‌రీంన‌గ‌ర్ , సిరిసిల్ల , ములుగు, ఖ‌మ్మం, భ‌ద్రాచ‌లం జిల్లాలలో గోదావ‌రి ఉగ్ర రూపం దాల్చింది.

Also Read : ఆగ‌ని వాన త‌ల్ల‌డిల్లుతున్న తెలంగాణ

Leave A Reply

Your Email Id will not be published!