Heavy Rains : ఎండా కాలం అయినా వర్షం
మారిన నగర వాతావరణం
Heavy Rains Hyderabad : ఓ వైపు ఎండా కాలం కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారి పోయింది. తెలంగాణలోని పలు చోట్ల ఈదురు గాలులతో పాటు వర్షాలు కురిసాయి. దీంతో నిన్నటి దాకా ఉక్క పోత, ఎండ వేడిని ఎదుర్కొంటున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం హైదరాబాద్ అంతటా కారుమబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం చిరు జల్లులతో ప్రారంభమై పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఉరుములతో కూడిన వర్షాలు పడుతుండడంతో సంతోషానికి లోనయ్యారు జనం.
ఇదే సమయంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ , తదితర జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్ల వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే వాతావరణ శాఖ మూడు రోజు ల పాటు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షాలు(Heavy Rains Hyderabad) కురుస్తాయని సూచించింది. దీంతో ముందు జాగ్రత్తగా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు.
జార్ఖండ్ నుంచి ఛత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ దాకా ద్రోణి ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు లేదా నాలుగు రోజులలో వర్షాలు కురిసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దాదాపు 20 జిల్లాలు వర్షాల ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇవాళ మెదక్ , కామారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్ , రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి , రంగారెడ్డి , హైదరాబాద్ , మేడ్చల్ జిల్లాలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక శుక్రవారం, శని, ఆదివారాల్లో ఆసిఫాబాద్ , మంచి్యాల, కరీంనగర్ , పెద్దపల్లి, భూపాల్లి, ములుగు, మహబూబాబాద్ , వరంగల్ , హనుమకొండ జిల్లాలో భారీగా వర్షాలు(Heavy Rains Hyderabad) పడే ప్రమాదం ఉందంటూ వాతావరణ శాఖ సూచించింది.
Also Read : ఏపీ బడ్జెట్ రూ. 2,79,279 కోట్లు