Helicopter Crash: ఉత్తరాఖండ్లో కుప్పకూలిన హెలికాఫ్టర్ ! ఐదురుగు మృతి !
ఉత్తరాఖండ్లో కుప్పకూలిన హెలికాఫ్టర్ ! ఐదురుగు మృతి !
Helicopter Crash : అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్ లో ఆదివారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గౌరికుండ్, త్రిజుగి నారాయణ్ మద్య ఆర్యన్ కంపెనీకి చెందిన హెలీకాఫ్టర్ ఈ ప్రమాదానికి గురైంది. అయితే ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Helicopter Crash Uttarakhand
ఆదివారం తెల్లవారు జామున 5:20 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ కేదార్నాథ్ ధామ్ నుండి గుప్త్ కాశి బయలుదేరింది. గౌరికుండ్ సమీపంలో కూలిపోయింది. పైలెట్ సహా ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 6 గురు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణీకులు ఉత్తరాఖండ్ (Uttrakhand), ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ కు చెందినవారుగా గుర్తించారు. ప్రమాదఘటన తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు.
హెలికాఫ్టర్ ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి సీరియస్
కాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హెలికాఫ్టర్ల ప్రమాదాలపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు. హెలి సర్వీసులపై స్పెషల్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ల సాంకేతిక స్థితి పూర్తిగా తనిఖీ చేయడం తప్పనిసరి అని, ప్రయాణానికి ముందు ఖచ్చితమైన వాతావరణ సమాచారం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అన్ని సాంకేతిక, భద్రతా అంశాల సమీక్ష కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
Also Read : Wife: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
