Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మరోసారి. పవర్ పాలిటిక్స్ లో అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
వాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశంలో మోదీ(Modi పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగుర వేసింది.
మరోసారి బీజేపీ పవర్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మోదీని ఘనంగా సన్మానించారు. మోదీ(Modi )కీలక ప్రసంగం చేశారు. ఈ విజయం మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
అలాగని విజయ గర్వంతో ఉండరాదని ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పని చేస్తే కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా గెలిపిస్తారని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
ప్రధానంగా వారసత్వ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలన్నారు. ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించి వాటికి చెక్ పెట్టానని చెప్పారు నరేంద్ర మోదీ. ఇక నుంచి ఉన్నా వారిని రానివ్వమంటూ పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీల వారసులు ఎవరికీ టికెట్లు కేటాయించ లేదని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి. ఇది నా వ్యక్తిగత నిర్ణయమన్నారు. దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
ఐదు రాష్ట్రాలలో బీజేపీకి ఓట్ల శాతం తక్కువ కావడంపై కూడా ఎంపీలు ఫోకస్ పెట్టాలని ఆదేశించారు పీఎం. ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన ద కశ్మీర్ ఫైల్స్ మూవీని ప్రతి ఒక్కరు చూడాలని సూచించారు.
Also Read : ఆ ఇద్దరి వల్లే ఓడి పోయాం