Hassan Nasrallah : ఇజ్రాయెల్ హీజ్బుల్లా దాడుల్లో హీజ్బుల్లా చీఫ్ మృతి
నెతన్యాహు సైతం అమెరికా పర్యటనను కుదించుకుని ఇజ్రాయెల్ తిరిగివచ్చారు...
Hassan Nasrallah : లెబనాన్ రాజధాని బీరుట్ లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో హిజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. నస్రల్లా(Hassan Nasrallah) ఇక ఎంతమాత్రం ఈ ప్రంపచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడంటూ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘ ఆపరేషన్ న్యూ ఆర్డన్ మిషన్’ విజయవంతమైనట్టు ఇజ్రాయెల్ వార్ రూమ్ సైతం ప్రకటించింది. అయితే, హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ మాత్రం ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా మరణించాడన్న వార్తలను ధ్రువీకరించలేదు. శుక్రవారం రాత్రి నుంచి ఆయన తమ కాంటాక్ట్‌లో లేరని, ఆయన ఎక్కడున్నారనేది కానీ, ఆరోగ్య పరిస్థితి కానీ తమకు తెలియదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Hassan Nasrallah No More..
కాగా, హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు శుక్రవారం నుంచి కురిపిస్తున్న బాంబుల వర్షం శనివారం తెల్లవారుజాము వరకూ కొనసాగింది. హిజ్బుల్లాపై పోరాటం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఐక్యరాజ్య సమితిలో ప్రకటించిన కొద్ది సేపటికే ఈ దాడులు మొదలయ్యాయి. నెతన్యాహు సైతం అమెరికా పర్యటనను కుదించుకుని ఇజ్రాయెల్ తిరిగివచ్చారు. ఈ వారంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 720కి పెరిగినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఘర్షణల నేపథ్యంలో దక్షిణ లెబనాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి సంఖ్య 2,11,000కు చేరినట్టు ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటనలో తెలిపింది. దాడులు చోటుకున్న లెబనాన్ ప్రాంతాల్లోని సుమారు 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూతపడినట్టు మానవతా వ్యవహారాల సమన్యయం కోసం ఏర్పాటు చేసిన యూఎన్ కార్యాలయం తెలిపింది.
Also Read : Minister Srinivasa Varma : తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన కేంద్ర మంత్రి