Shashi Tharoor : హైకమాండ్ కల్చర్ మారుస్తా – శశి థరూర్
నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు ఎంపీ శశి థరూర్(Shashi Tharoor). ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో గత కొంత కాలం నుంచీ సాగుతూ వస్తున్న హైకమాండ్ కల్చర్ ను పూర్తిగా తీసి వేస్తామని చెప్పారు. తాను ఏం చేస్తాననే దానిపై ఫుల్ క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీలో కీలక మార్పులు, సంస్కరణలు చోటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు శశి థరూర్.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ పట్ల తనకు ఉన్న విజన్ గురించి వివరించారు. ప్రస్తుతం పార్టీ భ్రష్టు పట్టడానికి ప్రధాన కారణం హైకమాండ్ అనుసరిస్తున్న నిర్వాకమేనని సంచలన ఆరోపణలు చేశారు.
ఒకవేళ తనను గెలిపించ గలిగితే పూర్తిగా ప్రక్షాళన చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు పార్టీకి విజన్ అంటూ లేకుండా పోయిందన్నారు. కేవలం పవర్ మొత్తం కేంద్రీకృతం కావడం వల్ల పార్టీకి భవిష్యత్తు కనిపించడం లేదన్నారు.
ఆయా రాష్ట్రాల పార్టీ చీఫ్ లు, యూనిట్లు వ్యక్తుల ప్రాతిపదికన కేంద్రీకృతమై నడుస్తున్నాయని ఇది పూర్తిగా పార్టీ నాశనం కావడానికి కారణంగా తోస్తోందన్నారు. ఢిల్లీలోనే పవర్ ఉండ కూడదన్నారు.
పవర్ ను కింది స్థాయి వరకు తీసుకు వెళ్లితేనే పార్టీ బలతోపేతం అవుతుందని అన్నారు శశి థరూర్. ఎవరైనా ఒక్క వాక్యంలో తీర్మానాలు చేయడం వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం చేకూరదన్నారు. ఇప్పటి వరకు అసమ్మతి వర్గం నాయకులలో జి 23లో కీలకమైన భూమిక పోషించారు ఎంపీ.
Also Read : కాంగ్రెస్ లో గాంధీయేతర అధ్యక్షులు