High Court Telangana : ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డిపై హైకోర్టు ఫైర్

రైతులపై కామెంట్స్ తేలితే జైలుకే

High Court  : మాజీ క‌లెక్ట‌ర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డికి కోలుకోలేని షాక్ త‌గిలింది. వ‌రి విత్త‌నాల అమ్మ‌కంపై సుప్రీంకోర్టు , హైకోర్టు (High Court )చెప్పినా వినేది లేదంటూ చేసిన కామెంట్స్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు.

రైతుల‌ను కించ ప‌రిచేలా చేసిన వెంక‌ట్రామిరెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచారించిన హైకోర్టు సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

ఒక వేళ రైతులపై చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మ‌ని తేలితే జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని, రెడీగా ఉండాల‌ని హెచ్చ‌రించింది వెంక‌ట్రామిరెడ్డిని. ఇంకా కొన్నాళ్ల పాటు క‌లెక్ట‌ర్ గా ప‌ని చేసే ఛాన్స్ ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ఉన్న‌ట్టుండి వీఆర్ఎస్ తీసుకున్నారు.

ఇదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న కాళ్లు మొక్కారు. అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా ఆయ‌న చేసిన ప‌నికి విస్తు పోయింది. సోష‌ల్ మీడియాలో అది హ‌ల్ చ‌ల్ గా మారింది.

ఇదిలా ఉండ‌గా విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు సీరియ‌స్ (High Court )వ్యాఖ్య‌లు చేసింది. రైతుల‌పై నోరు పారేసుకున్నారా లేదా స్ప‌ష్టంగా పేర్కొంటూ అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని మాజీ క‌లెక్ట‌ర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డిని ఆదేశించింది.

హైకోర్టు ఏంటి, సుప్రీంకోర్టు అంటే నాకు లెక్క‌నా ..అక్క‌డి నుంచి ఆర్డ‌ర్లు తెచ్చుకున్నా వ‌రి విత్త‌నాల్ని అమ్మ‌నీయ‌నంటూ 2021 అక్టోబ‌ర్ 25న వ్య‌వ‌సాయ అధికారులు, విత్త‌న డీల‌ర్ల స‌మావేశంలో వెంక‌ట్రామిరెడ్డి హెచ్చ‌రించారు.

ఈ విష‌యాన్ని ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. తాను కామెంట్ చేశానా లేదా అన్న‌ది చెప్ప‌కుండా ఇత‌ర చెత్త అంతా స‌మ‌ర్పిస్తే ఎలా అని మండిప‌డ్డారు చీఫ్ జ‌స్టిస్ స‌తీష్ చంద్ర శ‌ర్మ‌, జ‌స్టిస్ అభినంద‌న్ కుమార్ షావిలి డివిజ‌న్ బెంచ్ ఆదేశించింది.

Also Read : మోదీకి ఛాన్స్ ఇస్తే అమ్మ‌డం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!