Agnipath Protest : ఆందోళ‌న ఆపం చ‌చ్చేందుకు సిద్దం

కొన‌సాగుతున్న నిర‌స‌న‌కారుల ఫైర్

Agnipath Protest : అగ్నిప‌థ్ రిక్రూట్ మెంట్ స్కీం కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు దేశ వ్యాప్తంగా మిన్నంటాయి. బీహార్, ఉత్త‌ర ప్ర‌దేశ్, హ‌ర్యానా, తెలంగాణ రాష్ట్రాల‌లో నిర‌స‌న‌లు మిన్నంటాయి. తమ‌కు న్యాయం జ‌రిగేంత దాకా వెన‌క్కి వెళ్లే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

అప్ప‌టి దాకా ఇక్క‌డే ఉంటామ‌ని తెలిపారు. ఎలాంటి హెచ్చ‌రిక‌లు లేకుండా కాల్పుల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు. ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది. కేంద్రం ఆరా తీసింది. తాజాగా రైల్వే ట్రాక్ పై 200 మంది ఆందోళ‌న‌కారులు గుమిగూడారు.

వారి చుట్టూ సీఆర్పీఎఫ్‌, ఆర్ఏఎఫ్ పోలీసులు మోహ‌రించారు. నిర‌స‌న‌కారుల‌తో పోలీసులు చ‌ర్చ‌లు జ‌రిపారు. మీ వైపు క‌నీసం 20 మంది రావాల‌ని కోరారు. అందుకు ఆందోళ‌న‌కారులు ఒప్పుకోలేదు.

ట్రాక్ పైనే నిర‌స‌న తెలుపుతున్నారు. కేవ‌లం శాంతియుతంగా తాము నిర‌స‌న తెలియ చేయాల‌ని అనుకున్నామ‌ని, కానీ త‌మ‌పై కాల్పుల‌కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు. ఆందోళ‌న(Agnipath Protest) ఆపేది లేద‌ని చ‌చ్చేందుకు సిద్ద‌మ‌ని చెప్పారు.

శుక్ర‌వారం ఉద‌యం నుంచి ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉంది. దాదాపు 9 గంట‌ల కు పైగా జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా ఈ విధ్వంసం ప‌క్కా ప్లాన్ ప్ర‌కారమే జ‌రిగిందంటూ ఆరోపించారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ పటేల్.

ఇదిలా ఉండ‌గా ఖాకీల కాల్పుల్లో ఒక‌రు మృతి చెంద‌గా 8 మందికి పైగా గాయాలైన‌ట్లు స‌మాచారం. కాగా రైల్ ట్రాక్ పై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కారులు(Agnipath Protest) కొన‌సాగుతున్నాయి. నిర‌స‌న‌కారుల‌ను పంపించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఫ్లాట్ ఫామ్ లో మ‌ర‌మ్మ‌త్తులు చేస్తున్నారు. రైల్వే సిబ్బంది, టికెట్ బుకింగ్స్ ను ప్రారంభించారు. రాత్రి లోగా రైళ్ల‌ను పంపించే యోచ‌నలో ఉన్నారు.

Also Read : చంపే హ‌క్కు మీకు ఎవ‌రిచ్చారు

Leave A Reply

Your Email Id will not be published!