Maharastra Political Crisis : ముదిరిన మరాఠా రాజకీయ సంక్షోభం
ప్రభుత్వ ఏర్పాటుకు చాన్స్ ఇవ్వాలని లేఖ
Maharastra Political Crisis : మహారాష్ట్రలో కొలువు తీరిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మైనార్టీలో పడి పోయింది. శివసేన పార్టీకి చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలో ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించారు.
మొదట వీరందరితో కలిసి గుజరాత్ లోని సూరత్ హోటల్ లో బస చేశారు. అక్కడి నుంచి అస్సాం లోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ కు మకాం మార్చారు. ప్రస్తుతం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది.
రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ శివసేన పార్టీ చీఫ్, తాత్కాలిక సీఎం ఉద్దవ్ ఠాక్రే లేఖ రాశారు. ఇదే సమయంలో ఏక్ నాథ్
షిండే నేతృత్వంలోని 40 మంది ఎమ్మెల్యేలతో కూడిన సంతకాలతో తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ కోషియార్ , డిప్యూటీ స్పీకర్ కు లేఖలు పంపించారు.
ఈ తరుణంలో సందిట్లో సడేమియా అన్న చందంగా భారతీయ జనతా పార్టీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తమకు సర్కార్ ను ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.
మొత్తం మీద మరాఠా రాజకీయం(Maharastra Political Crisis) మరింత ఉత్కంఠను రేపుతోంది. ఎందుకంటే ఇంకొన్ని రోజులు పట్టేలా ఉంది. చివరి నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ కు ఉన్నట్టుండి కరోనా సోకింది.
దీంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్రపతి పాలన విధిస్తారా లేక షిండే సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారా అన్నది తేలాల్సి ఉంది.
అయితే తమదే అసలైన శివసేన పార్టీ అంటూ సంచలన ప్రకటన చేశారు ఏక్ నాథ్ షిండే. మొత్తంగా మరాఠా మరోసారి భగ్గుమంటోంది.
Also Read : ఆ ఎమ్మెల్యేలు గౌహతిలో ఉన్నట్లు తెలియదు – సీఎం