BC Nagesh : పీయూసీ ప‌రీక్ష‌లో హిజాబ్ ఒప్పుకోం

క‌ర్ణాట‌క విద్యా శాఖ మంత్రి బీసీ న‌గేష్

BC Nagesh Hijab : మ‌రోసారి హిజాబ్ వివాదానికి తెర లేపారు క‌ర్ణాట‌క రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ న‌గేష్. ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పీయూసీ ప‌రీక్ష‌లో హిజాబ్ ధ‌రించి వ‌స్తే ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకు త‌మ ప్ర‌భుత్వం అంగీక‌రించద‌ని పేర్కొన్నారు. హిజాబ్ నిషేధం త‌ర్వాత ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన ముస్లిం విద్యార్థినుల సంఖ్య మరింత మెరుగు ప‌డింద‌ని చెప్పారు. మంత్రి బీసీ న‌గేష్(BC Nagesh Hijab) మీడియాతో మాట్లాడారు.

అయితే త‌న తాను చేసిన ఈ కామెంట్స్ కు సంబంధించి ఎంత మంది వ‌స్తున్నార‌నే సంఖ్య‌ను మాత్రం చెప్ప‌లేన‌ని అన్నారు బీసీ న‌గేష్. హిజాబ్ ధ‌రించిన విద్యార్థులు మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న ప్రీ యూనివ‌ర్శిటీ కోర్సు (పీయూసీ) ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతామంటే ఒప్పుకోమ‌న్నారు. వారిని నిర్దాక్షిణ్యంగా వెన‌క్కి పంపిస్తామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

గ‌త ఏడాది మాదిరి గానే విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా యూనిఫాం ధ‌రించి ప‌రీక్ష రాయాల‌ని స్ప‌ష్టం చేశారు విద్యా శాఖ మంత్రి బీసీ న‌గేష్ . ఇదే స‌మ‌యంలో హిజాబ్ ధ‌రించిన విద్యార్థుల‌ను ప‌రీక్ష రాసేందుకు అనుమ‌తించ బోమంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఎవ‌రైనా స‌రే ప్ర‌భుత్వం అమ‌లు చేసిన రూల్స్ పాటించాల్సిందేన‌ని పేర్కొన్నారు బీసీ న‌గేష్(BC Nagesh). రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థ‌లు నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని చెప్పారు విద్యా శాఖ మంత్రి.

ఇదిలా ఉండ‌గా విద్యార్థులు హిజాబ్ ధ‌రించి ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు అయ్యేలా క‌ర్ణాట‌క లోని ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ఆదేశించాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్లను త‌క్ష‌ణమే జాబితా చేయాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.

Also Read : భార‌త విద్యార్థిపై అమెరికా నిషేధం

Leave A Reply

Your Email Id will not be published!