Shahnawaz Hussain : హిజాబ్ మహిళ ఎంఐఎం చీఫ్ అవుతుందా
అసదుద్దీన్ ఓవైసీకి షానవాజ్ హుస్సేన్ సవాల్
Shahnawaz Hussain : బ్రిటన్ లో మైనార్టీ వర్గంగా ఉన్న భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవిని అధీష్టించాడు. ఈ సందర్భంగా భారత దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇక్కడ మైనార్టీలకు అలాంటి అవకాశం వస్తుందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిజాబ్ (ముసుగు) ధరించిన మహిళ భారత దేశానికి ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడు ఎప్పుడైనా అవుతుందా అని ప్రశ్నించారు. ఆనాడే ఈ దేశానికి స్వేచ్ఛ లభించినట్లు అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింలు, మైనార్టీ వర్గాలకు చెందిన వారు ప్రాణాలు అర్పించారని కానీ వారికి చరిత్రలో చోటు లేకుండా పోయిందని ఆరోపించారు.
ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్(Shahnawaz Hussain) మాట్లాడారు. ముందు తాను చీఫ్ గా ఉన్న ఎంఐఎం పార్టీకి హిజాబ్ (ముసుగు) ధరించిన మహిళ ఎప్పుడు అవుతుందో చెప్పాలంటూ అసదుద్దీన్ ఓవైసీకి సవాల్ విసిరారు.
ఆయన చేసిన సవాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దేశంలో ఉన్నంత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడా లేదన్నారు. ఇక్కడ మైనార్టీలు అన్న వారు ప్రశాంతంగా ఉన్నారని కానీ ఓవైసీ లాంటి వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పదే పదే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తుంటారని మండిపడ్డారు షానవాజ్ హుస్సేన్.
Also Read : రిషి సునక్ ను చూసి మోదీ నేర్చుకోవాలి