Himachal Pradesh BJP List : హిమాచల్ బీజేపీ అభ్యర్థులు డిక్లేర్
మొత్తం 62 స్థానాలకు క్యాండిడేట్స్ ఖరారు చేసిన పార్టీ
Himachal Pradesh BJP List : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే ముందే పోటీ చేసే అభ్యర్థుల జాబితాను(Himachal Pradesh BJP List) ప్రకటించింది. బుధవారం ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లిస్టును విడుదల చేశారు.
రాష్ట్రంలో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా పార్టీకి సంబంధించిన సమావేశంలో ఐదుగురు మహిళా అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో(PM Modi) పాటు ఇతర నాయకులు కూడా ఉన్నారు.
మొత్తం స్థానాలకు ఇవాళ అభ్యర్థులను ప్రకటించింది పార్టీ. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన ఒక రోజు తర్వాత జాబితా విడుదల కావడం విశేషం. ఈ కీలక మీటింగ్ లో మోదీతో పాటు అమిత్ చంద్ర షా పాల్గొన్నారు.
ఇక హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ సెరాజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు వచ్చే నెల నవంబర్ 12న జరగనున్నాయి. ఇదిలా ఉండగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 46 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
ఉనా జిల్లా లోని హరోలి నుంచి శాసనసభా పక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రిని పోటీకి దింపింది. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ లు సుఖ్విందర్ సింగ్ సుఖు, కుల్దీప్ సింగ్ రాథోడు వరుసగా నదౌన్ , థియోగ్ నియోజకవర్గం నుండి బరిలో ఉండనున్నారు.
ఏఐసీసీ మాజీ కార్యదర్శి ఆశా కుమారి డల్హౌసీ స్థానం నుంచి పోటీ చేస్తారు. ఇక 12న పోలింగ్ జరిగితే డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Also Read : తాను ఏం చేస్తున్నానో ప్రజలు గమనించాలి