Himanshu Vyas : కాంగ్రెస్ కు షాక్ హిమాన్షు వ్యాస్ గుడ్ బై
గుజరాత్ లో పార్టీకి కోలుకోలేని దెబ్బ
Himanshu Vyas : కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజస్తాన్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆ పార్టీకి కీలకమైన నాయకుడిగా ఉన్న హిమాన్షు వ్యాస్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఇప్పటి వరకు ఉన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో కీలకమైన నాయకుడిగా పేరొందారు. ఇవాళ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కు తన రాజీనామా లేఖను పంపించారు. ఇదిలా ఉండగా గుజరాత్ లోని సురేంద్ర నగర్ లోని వద్వాన్ స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు. బీజేపీ చేతిలో ఓటమి పాలయ్యారు.
విశ్వసనీయ సమాచారం హిమాన్షు వ్యాస్ త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు టాక్. పార్టీకి గుడ్ బై చెప్పిన అనంతరం హిమాన్షు వ్యాస్ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీపై. పార్టీలో తన మాట ఎవరూ వినడం లేదని, తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదని వాపోయారు.
పార్టీలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందన్నారు. ప్రధానంగా ఆయన విమర్శలు రాహుల్ గాంధీపై చేయడం విస్తు పోయేలా చేసింది. ఆయనను కలవాలంటే చాలా కష్టమని, ఢిల్లీలో కొద్ది మంది చేతుల్లో బందీ అయి పోయారని ఇక పార్టీ ఎలా బతుకుందన్నారు. ప్రజాస్వామ్యం ఉందని పదే పదే చెప్పే పార్టీలో నియంతృత్వం సాగుతోందంటూ మండిపడ్డారు హిమాన్షు వ్యాస్(Himanshu Vyas) .
ఇక గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ రావడం వల్ల బీజేపీ ఓటు బ్యాంకు చీలదని కానీ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయమని జోష్యం చెప్పారు.
Also Read : ప్రజాస్వామ్యానికి పాతర రాచరికానికి జాతర