Hindenburg Adani Group : అదానీని ఎదుర్కొనేందుకు సిద్దం
స్పష్టం చేసిన హిండెన్ బర్గ్ రీసెర్చ్
Hindenburg Adani Group : అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసిన అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ కీలక ప్రకటన చేసింది. సదరు సంస్థ కొట్టిన దెబ్బకు వేల కోట్లు ఆవిరై పోయాయి అదానీగ్రూప్ కు. కావాలని చేస్తున్న కుట్ర అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ . దీనిపై తీవ్రంగా స్పందించి రీసెర్చ్ సంస్థ(Hindenburg Adani Group).
అదానీ గ్రూప్ ను ఏ స్థాయిలోనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. భారతీయ బిలియనీర్ ఫ్లాగ్ షిప్ $2.5 బిలియన్ల వాటా విక్రయాన్ని పూర్తి చేసేందుకు ముందుకు కీలక ప్రకటన చేసింది హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ. ఇదిలా ఉండగా రీసెర్చ్ సంస్థపై గౌతమ్ అదానీ 413 పేజీల ఖండనను ప్రచురించారు.
100 పేజీల నివేదికలో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అనుకూలంగా దృష్టి సారించడానికి ప్రయత్నించింది. ముఖ్యమైన సమస్యలకు దూరంగా , బదులుగా జాతీయవాద కథనాన్ని ప్రేరేపించింది. తాము విభేదిస్తున్నాము. స్పష్టంగా చెప్పాలంటే భారత దేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యం
, ఉత్తేజకరమైన భవిష్యత్తుతో అభివృద్ది చెందుతున్న సూపర్ పవర్ అని మేము నమ్ముతున్నామని , దేవాన్ని క్రమ పద్దతిలో దోచుకుంటూ భారత జెండాను కప్పుకున్న అదానీ గ్రూప్ భారత దేశ భవిష్యత్తును అడ్డుకుంటున్నదని మేము నమ్ముతున్నామని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ.
మోసం అనేది వాస్తవం అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు చేసినా లేదా ఇతరులు చేసినా తప్పేనని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ చీఫ్ ఆండర్సన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అటు హిండెన్ బర్గ్ ఇటు అదానీ గ్రూప్ నువ్వా నేనా అని సవాళ్లు విసురుతున్నాయి.
Also Read : 7వ స్థానానికి పడి పోయిన అదానీ