Teacher Shot Dead : కుల్గామ్ లో హిందూ టీచర్ కాల్చివేత
కాల్చి చంపిన ఉగ్రవాదులు
Teacher Shot Dead : జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టుల ఆగడాలు మరీ శ్రుతిమించాయి. హిందువులే టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు. కాల్పుల మోత మోగిస్తున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో హిందూ టీచర్ మతి చెందింది.
ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన ఉగ్ర మూకల్ని గుర్తించి మట్టు బెడతామని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. కాల్పులకు పాల్పడడంతో తీవ్రంగా గాయపడిన కుల్గామ్ కు చెందిన రజనీ భల్లాను ఆస్పత్రికి తరలించారు.
అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కుల్గామ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేవలం హిందువులనే టార్గెట్ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. కాశ్మీరీ పండిట్ ను ఇటీవల కాల్చి చంపారు.
దీనిపై పెద్ద ఎత్తున కాశ్మీరీ పండిట్లు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక వైఖరిని తప్పు పట్టారు. ఈ తరుణంలో తాజాగా హిందూ టీచర్(Teacher Shot Dead) ను టార్గెట్ చేయడాన్ని తట్టుకోలేక పోతున్నారు.
కాగా ఈ ఘటన కుల్గామ్ లోని గోపాల్ పోరా ప్రాంతంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతాన్ని పోలీసులు చుట్టు ముట్టారు. దాడికి పాల్పడిన ఉగ్రమూకల్ని పట్టుకునేందుకు సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు.
పరిస్థితి మాత్రం అలాగే ఉంది. ఆ ప్రాంతం మొత్తం భయాందోళనకు గురైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే దానిపై ఆరా తీస్తున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు.
Also Read : సిద్దూ అంత్యక్రియలకు భారీ భద్రత