Jaggi Vasudev : చరిత్రను మార్చలేం చర్చ అనవసరం
నాటి విధ్వంసాలపై చర్చలు వేస్ట్
Jaggi Vasudev : ప్రపంచ ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవన్(Jaggi Vasudev) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన వాటిని ఇప్పుడు ముందుకు తీసుకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
కొన్నేళ్ల కిందట దండయాత్రల సమయంలో ధ్వంసమైన ఆలయాల గురించి ఇప్పుడు మాట్లాడటంలో అర్థం లేదన్నారు. ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆనాటి కాలంలో వేలాది దేవాలయాలు ధ్వంసం అయ్యాయి.
వాటి గురించి ఇప్పుడు చర్చకు తీసుకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఒనగూరదన్నారు. కోల్పోయిన కాలాన్ని, గతంలో రాసిన చరిత్రను చదవగలమే తప్పా తిరిగి మార్చ లేమన్నారు జగ్గీ వాసుదేవన్.
గతం కంటే భవిష్యత్తు కంటే వర్తమానం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు సద్గురు. కరోనా కష్ట కాలంలో ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఇప్పుడు దేశానికి కావాల్సింది అన్ని కులాలు, జాతులు, మతాలు కలిసి కూర్చుని మాట్లాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు వాసుదేవన్.
విలువైన కాలాన్ని గుర్తించకుండా కేవలం గతంలో జరిగిన దానిని ముందుకు తీసుకు వస్తూ కాల యాపన చేయడం మంచి పద్దతి కాదన్నారు జగ్గీ .
ఏదేని వివాదం దేశంలో ఇరు మతాల మధ్య నెలకొంటోంది. ఇందులో భాగంగా హిందువులు, ముస్లింలు కలిసి కూర్చుని పరిష్కరించుకుంటే ఇంత రాద్దాంతం జరగదన్నారు.
భారత దేశం కీలక దశలో ఉందని ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయన్నారు జగ్గీ వాసుదేవన్(Jaggi Vasudev). మత పరమైన వివాదాలను రాజకీయ నాయకులు పొలిటికల్ మైలేజ్ గా చూడొద్దంటూ సూచించారు.
Also Read : బుద్దం శరణం గశ్చామి – నరేంద్ర మోదీ