Hizbul Terrorist Killed : అనంతనాగ్ లో హిజ్బుల్ కమాండ‌ర్ హ‌తం

నిసార్ ఖండేను మ‌ట్టుబెట్టామ‌న్న ఐజీ

Hizbul Terrorist Killed : జ‌మ్మూ, కాశ్మీర్ లో వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకుండ‌డంతో భార‌త ఆర్మీ మ‌రింత సెర్చింగ్ ఆప‌రేష‌న్ మొద‌లు పెట్టింది. ఒక్క కాశ్మీర్ లోనే ఉగ్ర‌వాదులు పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని కాల్పుల‌కు తెగ బ‌డ్డారు.

ఇప్ప‌టి వ‌ర‌కు వారం రోజుల వ్య‌వ‌ధిలో ఎనిమిది మందిని పొట్ట‌న పెట్టుకున్నారు. కుల్గాం జిల్లాలో ఓ టీచ‌ర్, కాశ్మీరీ పండిట్, బ్యాంక్ మేనేజ‌ర్, బీహార్ నుంచి వ‌చ్చిన వ‌ల‌స కూలీని మ‌ట్టు బెట్టారు.

దీంతో కేంద్ర హోం శాఖ మంత్రి భార‌త త్రివిధ ద‌ళాల చీఫ్ , ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో పాటు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ హాజ‌ర‌య్యారు. చోటు చేసుకుంటున్న వ‌రుస ప‌రిణామాల‌పై సీరియ‌స్ గా చ‌ర్చించారు.

తాజాగా ఉగ్ర‌వాదుల ఏరివేత‌ను ముమ్మ‌రంగా చేప‌ట్టాయి భార‌త భ‌ద్ర‌తా ద‌ళాలు. శ‌నివారం తెల్లవారుజామున జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన క‌మాండ‌ర్ ఖ‌తం(Hizbul Terrorist Killed) చేసింది.

జిల్లా లోని రిషి పోరా గ్రామం క‌ప్రాన్ ప్రాంతంలో ఉగ్ర మూక‌లు ఉన్నార‌నే స‌మాచారంతో స్థానిక పోలీసులు , భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చుట్టు ముట్టాయి. పెద్ద ఎత్తున మోహ‌రించాయి.

ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంట‌ర్ లో హిజ్బుల్(Hizbul Terrorist Killed) క‌మాండ‌ర్ నిసార్ ఖండేను మ‌ట్టు బెట్టారు.

ఇదే విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు కాశ్మీర్ ఐజీ విజ‌య్ కుమార్. ఉగ్ర‌వాద కాల్పుల్లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయ‌ప‌డ్డార‌ని తెలిపారు. వారంద‌రినీ హెలికాప్ట‌ర్ లో చికిత్స కోసం త‌ర‌లించిన‌ట్లు వెల్ల‌డించారు.

Also Read : ఆర్మీ చీఫ్ ..ధోవ‌ల్ తో అమిత్ షా భేటీ

Leave A Reply

Your Email Id will not be published!