Hockey5s Asia Cup : భారత్ ఆసియా కప్ హాకీ విజేత
థ్రిల్లింగ్ షూటౌట్ లో పాక్ కు షాక్
Hockey5s Asia Cup : ఒమన్ వేదికగా జరిగిన ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్ లో భారత హాకీ జట్టు పాకిస్తాన్ ను ఓడించింది. విజేతగా నిలిచింది. థ్రిల్లింగ్ షూటౌట్ లో దాయాది దేశానికి షాక్ తప్పలేదు. గుర్జోత్ సింగ్ , మనీందర్ సింగ్ ఇండియా తరపున గోల్స్ చేశారు.
Hockey5s Asia Cup India Winnings
షౌటౌట్ లో భారత జట్టు పాకిస్తాన్ ను 2-0 తేడాతో ఓడించింది. ఇదిలా ఉండగా నిర్ణత సమయం ముగిసే సరికి ఇరు జట్లు చెరో 4 గోల్స్ తో సరి సమానంగా నిలిచాయి. ఈ తరుణంలో అంపైర్లు షూటౌట్ ఛాన్స్ ఇచ్చారు. భారత్ ఆటగాళ్లు సక్సెస్ అయ్యారు. కానీ ప్రత్యర్థి పాకిస్తాన్ ఆటగాళ్లు తేలి పోయారు.
ఈ గెలుపుతో భారత్ ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ 5 ప్రపంచ కప్ 2024లో చోటు దక్కించుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నిర్ణీత సమయంలో భారత్ తరపున రహీల్ 19వ నిమిషంలో, 26వ నిమిషంలో రెండు గోల్స్ సాధించాడు. 7వ నిమిషంలో జుగ్రాజ్ సింగ్ , 10వ నిమిషంలో మనీందర్ సింగ్ గోల్స్ సాధించారు.
ఇక షూటౌట్ లో గుర్జోత్ సింగ్, మణిందర్ సింగ్ గోల్స్ సాధించారు. భారత జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టారు. ఇదిలా ఉండగా భారత జట్టు ఆసియా కప్ విజేతగా నిలవడంతో ఆనందం వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
Also Read : IND vs PAK Ishan Pandya : ఇషాన్ షాన్ దార్ పాండ్యా జోర్దార్