Bhagwant Mann : పంజాబ్ లో కొత్తగా సీఎంగా కొలువు తీరిన భగవంత్ మాన్ (Bhagwant Mann )సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయన అవినీతి, అక్రమాలకు ఉక్కుపాదం మోపారు.
ఇందు కోసం లంచం ఎవరిని అడిగినా వెంటనే తనకు ఫోన్ చేయాలని వీడియో లేదా మెస్సేజ్ చేయాలని సూచించారు సీఎం. ఇవాళ మరో సంచలన ప్రకటన చేశారు.
ఈనెల 23న స్వాతంత్రం కోసం తమ విలువైన ప్రాణాలను బలిదానం చేశారు సర్దార్ షహీద్ భగత్ సింగ్ (Bhagat Singh) , సుఖ్ దేవ్ థాపర్ (Sukhdev Thapar) , శివ్ రామ్ రాజ్ గురు (Shiv Ram Raj Guru) .
అమరుల దినోత్సవంగా నిర్వహించే ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించిస్తున్నట్లు భగవంత్ మాన్ (Bhagwant Mann )వెల్లడించారు. అంతే కాకుండా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా భగత్ సింగ్ (Bhagat Singh) తో పాటు భారత రాజ్యాంగ స్పూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
సీఎం చేసిన సూచనకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్ (Bhagat Singh) , అంబేద్కర్ ఫోటోలు తప్ప తన ఫోటోలు ఉండ కూడదని ఆదేశించారు.
అంతే కాదు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టుల భర్తీ కి సీఎం ఆమోదం తెలిపారు. వీటిని పోలీస్ శాఖలో 10 వేల జాబ్స్ భర్తీ చేస్తామని మరో 15 వేల కొలువులను కార్పొరేషన్లు, బోర్డులు, ప్రభుత్వ శాఖలలో భర్తీ చేస్తామని త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు.
అంతే కాదు రాష్ట్ర ప్రజలు అంతా చూసే విధంగా అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రకటించారు.
Also Read : పేదరికం పాపం యోగి నిర్వాకం