Home Minister Shah : మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి కీలక సమీక్ష
చత్తీస్‌గఢ్ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి...
Home Minister : కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, సీఎస్‌లు, డీజీపీలు హాజరుకానున్నారు. 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా సమీక్ష సమావేశం జరగనుంది. త్వరలో మావోయిస్టు సమస్య నుంచి విముక్తి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం చత్తీస్‌గఢ్ అభయారణ్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా నిర్వహించే సమావేశానికి ఉభయ రాష్ట్రాల మంత్రులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హోం మంత్రి వంగలపూడి అనిత, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ హాజరుకానున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఒడిశా, పశ్చిమ బంగాల్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.
Home Minister Amit Shah..
చత్తీస్‌గఢ్ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. అబూజ్‌మడ్ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో తెలుగువారు ఉన్నట్లు సమాచారం. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ జోరీగ నాగరాజు ఎన్‌కౌంటర్ హతమైనట్లు తెలుస్తోంది. నాగరాజుకు మావోయిస్టు పార్టీలో పలురకాల పేర్లు ఉన్నాయి. నాగరాజును కమలేష్, రామకృష్ణ, ఆర్కే , విష్ణు అనే పేర్లతో పార్టీలోని కేడర్ పిలుస్తుంటారు. నాగరాజును పట్టుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 25 లక్షల రివార్డ్ ప్రకటించింది. రూ. 25 లక్షల రివార్డ్ ఉండటంతో నాగరాజు కేంద్ర కమిటీలో కూడా సభ్యుడు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు స్వస్థలం విజయవాడకు సమీపంలోని పోరంకి గ్రామం. దండకారణ్యం పార్టీ వ్యవహారాల్లో నాగరాజుది కీలక పాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా.. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. నారాయణపూర్, దంతెవాడ సరిహద్దు నెందూర్, తులతులి అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు బలగాలకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. ఈ రెండు జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వు గార్డు (డీఆర్‌జీ), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్)తో పాటు ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్ బెటాలియన్లకు చెందిన మొత్తం 1200 మంది మావోయిస్టుల కోసం సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఓర్చా, బారాసూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలు గోవెల్, నెందూర్, తులతులి సమీపంలో శుక్రవారం ఉదయం అబూజ్‌మడ్‌లో బలగాలు కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నెందూర్-తులతులి సమీపంలో మావోయిస్టులు తారసపడి కాల్పులు మొదలు పెట్టడంతో ప్రతిగా బలగాలు తీవ్రంగా స్పందించాయి. ఇరువర్గాల మధ్య భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. సాయంత్రం అడవుల్లో గాలించగా 28 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను గుర్తించాల్సి ఉంది.
Also Read : Tirumala : శ్రీవారి అన్నప్రసాదం లో జెర్రీ కలకలం..నిజం కాదంటున్న టీటీడీ