INDW vs SAW 2022 : భారత మహిళా జట్టు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ న్యూజిలాండ్ వేదికగా జరుగుతోంది. టోర్నీకి సంబంధించి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ (INDW vs SAW 2022)కు చేరుకున్నాయి.
ఇక పాకిస్తాన్ ఇంటి బాట పట్టింది. ఆ జట్టుపై కీవీస్ 71 పరుగులతో విక్టరీ సాధించినా సెమీస్ చేరుకోలేక పోయింది. ఇక మరో సెమీస్ బెర్త్ కోసం భారత్, విండీస్ , ఇంగ్లండ్ జట్లు పోటీ పడుతున్నాయి.
ఈనెల 28న సోమవారం క్రైస్ట్ చర్చ్ వేదికగా సఫారీ టీంతో మిథాలీ సేన తలపడనుంది. చావో రేవో తేల్చుకోనింది. లక్ బాగుండి వర్షం పడినా లేదా గెలిచినా భారత్ కు సెమీస్ చేరేందుకు అవకాశం ఉంటుంది.
లేక పోతే పెట్టే బేడా సర్దుకుని ఇంటికి రావాల్సి ఉంటుంది. ఇక బంగ్లాదేశ్ పై ఇంగ్లండ్(INDW vs SAW 2022) విజయం అన్నది లాంఛనప్రాయమేనని చెప్పక తప్పదు. కానీ ఉన్న చిక్కంతా భారత జట్టు సఫారీపై గెలిస్తేనే బెటర్ లేదంటే కష్టం.
అదృష్టం బావుండి గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండానే సెమీస్ కు నేరుగా మిథాలీ సేన వెళుతుంది. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఒకవేళ వర్షం కారణంగా రద్దు అయితే గనుక ఇరు జట్లకు చెరో పాయింట్లు వస్తాయి. సమానంగా ఉంటే రన్ రేట్ ను పరిగణలోకి తీసుకుంటారు. రన్ రేట్ పరంగా చూస్తే భారత్ కు సఫారీ జట్టు కంటే కొంచెం మెరుగైన స్థితిలో ఉంది.
Also Read : ఉమెన్ ఐపిఎల్‌కి సిద్దమవుతున్న బిసిసిఐ