Sam Pitroda : రాహుల్ వ్యాఖ్యలను వక్రీకరిస్తే ఎలా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ శామ్ పిట్రోడా
Sam Pitroda : రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా(Sam Pitroda). కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ కావాలని పదే పదే రాహుల్ ను టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మంగళవారం శామ్ పిట్రోడా మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మాట్లాడిన సమయంలో బీజేపీకి చెందిన వారు ఎవరూ లేరన్నారు. తమ నాయకుడు అన్న దాంట్లో తప్పు ఏముందని ప్రశ్నించారు.
నిజంగా భారత దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని ఆరోపించారు. డెమోక్రసీ ప్రమాదంలో పడిందని తమ నాయకుడు చేసిన కామెంట్స్ లో అక్షరాలా వంద శాతం ఉందన్నారు శామ్ పిట్రోడా(Sam Pitroda). పొద్దస్తమానం అబద్దాలను ప్రచారం చేస్తున్నది బీజేపీ నాయకులేనంటూ మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఇవాళ పార్లమెంట్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని. భారత దేశం గురించి విదేశాలలో చులకనగా మాట్లాడారని, తాము ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.
ఇదిలా ఉండగా ముందు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మధ్య ఉన్న బంధం ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో ఇరు సభలు వాయిదా పడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. శామ్ పిట్రోడా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : నాకేమైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత