Anna Hazare : మోదీ పాలనలో అనకొండలా అవినీతి – హజారే
దేశ వ్యాప్తంగా యుద్దానికి శ్రీకారం
Anna Hazare : కేంద్రంలో 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొలువు తీరిన బీజేపీ సంకీర్ణ సర్కార్ పాలన గాడి తప్పిందని..అంతులేని రీతిలో అవినీతి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు అన్నా హజారే(Anna Hazare) కార్యదర్శి కల్పనా ఇనాందార్.
ఈమేరకు అన్నా హజారే త్వరలోనే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారని సంచలన ప్రకటన చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా కరప్షన్ అనకొండలా పెరిగిందని ఆరోపించారు. ప్రధానంగా పారిశ్రామికవేత్తలు, బడా బాబులు, కార్పొరేట్లు అందినంత మేర దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయాన్ని అన్నా హజారే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మరో సమర శంఖం పూరించేందుకు సన్నద్దం అవుతున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్నా హజారే బృందం కీలక సమావేశం నిర్వహించింది.
ఈ మేరకు అన్నా హజారే సమక్షంలో దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య , మహిళలపై దాడులు, విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ వ్యాప్తంగా అనకొండలా అవినీతి అల్లుకు పోయిందన్నారు. ప్రజలు అఖండ మెజారిటీ కట్టబెట్టడాన్ని దుర్వినియోగం చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు అన్నా హజారే(Anna Hazare). యూపీలో రాష్ట్రీయ కిసాన్ మంచ్ ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు కల్పనా ఇనాందార్.
ఆనాడు అన్నా హజారే చేసిన ఉద్యమం కారణంగానే బీజేపీ పవర్ లోకి వచ్చిందన్నారు. 2014లో 2019లో వరుసగా పవర్ లోకి వచ్చిన మోదీ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారంటూ ఆరోపించారు.
Also Read : భారీ సంస్కరణలకు సోరేన్ శ్రీకారం