Statue Of Equality : శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరామనగరం ఆధ్యాత్మిక శోభను(Statue Of Equality) సంతరించుకుంది. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
దేశం నలుమూలల నుంచి సమతా కేంద్రంలో 216 అడుగులతో ఏర్పాటు చేసిన శ్రీ భగవద్ రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. ప్రతి రోజూ యాగాలు, పూజలు చేస్తున్నారు.
సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలలో భాగంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉదయం అష్టాక్షరీ కోటి మంత్ర పఠనం చేశారు. శ్రీరామ పెరుమాళ్ స్వామికి ప్రాతః కాల ఆరాధాన చేపట్టారు. వేద పారాయణం పూర్తయింది.
శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం నిర్వహించారు. ఇష్టి శాలలో వ్యాధి నివారణకు , సంపూర్ణ ఆరోగ్యం కోసం పరమేష్టి యాగాన్ని చేపట్టారు. ప్రవచన మండపంలో శ్రీ వాసుదేవ అష్టోత్తర పూజ చేశారు.
ఉత్సవాలలో భాగంగా పూర్ణాహుతి, ప్రముఖుల ప్రపచనాలు, కళాకారుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీలక్ష్మీ నారాయణ మహా యజ్ఞం, రాత్రి పూర్ణాహుతి చేపడతారు.
శ్రీరామనగరం, సమతా కేంద్రం జై శ్రీమన్నారయణ అన్న నినాదనాలతో మారుమోగుతోంది. పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వాములు, ఆచార్యులు, పండితులు పాల్గొన్నారు.
5 వేల మందికి పైగా రిత్వికులు ఈ ఉత్సవాలలో పాలు పంచుకుంటున్నారు. ఉప రాష్ట్రపతి కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 108 దివ్య దేశాలను దర్శించుకుంటారు.
7 గంటలకు 3డీ మ్యాప్ లేజర్ షోను ఏర్పాటు చేశారు. చిన్న జీయర్ ఆశీస్సులు తీసుకుంటారు. భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
Also Read : చిన్నజీయర్ ప్రయత్నం గొప్పది