Tirumala : తిరుమ‌ల‌ క్షేత్రం గోవింద నామ‌ స్మ‌ర‌ణం

పుణ్య క్షేత్రానికి పోటెత్తిన భ‌క్తులు

Tirumala : ఎండ‌లు దంచి కొడుతున్నాయి. వాతావ‌ర‌ణ శాఖ ఇదిగో అదిగో వ‌ర్షాలు వ‌స్తున్నాయంటూ ఊరిస్తున్నా వాన దేవుడు క‌రుణించ‌డం లేదు. మ‌రో వైపు వ‌డ‌గాల్పులు ఉన్నా భ‌క్తుల తాకిడితో తిరుమ‌ల కిట కిట లాడుతోంది. ఎక్క‌డ చూసినా భ‌క్త జ‌న‌సందోహ‌మే. గోవిందా గోవిందా ఆప‌ద మొక్కుల వాడా గోవిందా, అనాధ ర‌క్ష‌క గోవిందా అంటూ నామ స్మ‌ర‌ణంతో హోరెత్తిస్తున్నారు శ్రీవారి భ‌క్తులు.

ఎండా కాలం మొత్తం భ‌క్తులతో నిండి పోయింది తిరుమ‌ల‌. విద్యా సంస్థ‌లకు సెల‌వులు ప్ర‌క‌టించిన స‌మ‌యంలో భ‌క్తుల ర‌ద్దీ మ‌రింత పెరిగింది. ఇటీవ‌లి ద‌ర్శ‌నాల్లో గ‌త ఆదివారం భ‌క్తులు ఏకంగా 92 వేల మందికి పైగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, అలివేలు మంగ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. ఇందులో భాగంగా క‌నీసం 72 వేల‌కు త‌క్కువ కాకుండా భ‌క్తులు రోజూ వారీగా ద‌ర్శించు కోవ‌డం విశేషం.

స్వామి, అమ్మ వారి క‌రుణ క‌టాక్షం కోసం భ‌క్తులు ఇంకా త‌ర‌లి వ‌స్తూనే ఉన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశంలోని ఇత‌ర ప్రాంతాల నుండి, విదేశాల నుండి సైతం శ్రీ‌వారి భ‌క్తులు క్యూ క‌ట్టారు ద‌ర్శ‌నం కోసం. సోమ‌వారం కాస్తంత త‌గ్గారు భ‌క్తులు. మొత్తం 69,879 మంది తిరుమ‌ల‌ను(TTD) ద‌ర్శించుకున్నారు. స్వామి క‌రుణ క‌టాక్షం పొందారు. 29 వేల 519 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. హుండీ ద్వారా భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల ఆదాయం రూ. 3.82 కోట్లకు చేరింది.

Also Read : Ankush Sachdeva : షేర్ చాట్ వెనుక స‌చ్ దేవా

 

Leave A Reply

Your Email Id will not be published!