Ankush Sachdeva : షేర్ చాట్ వెనుక స‌చ్ దేవా

కోట్ల ట‌ర్నోవ‌ర్ వెనుక అతడు

Ankush Sachdeva : ప్ర‌పంచాన్ని సోషల్ మీడియా శాసిస్తోంది. ప్ర‌స్తుతం సామ‌జిక మాధ్య‌మాల హ‌వా న‌డుస్తోంది. ఇందులో భార‌త దేశానికి చెందిన ఐఐటియ‌న్ సాధించిన స‌క్సెస్ చూసి నివ్వెర పోతోంది ప్ర‌పంచం. ఆ అద్భుత విజ‌యాన్ని సాధించిన వ్య‌క్తి ఎవ‌రో కాదు అంకుష్ స‌చ్ దేవా. అత‌డు స్టార్ట్ చేసిన సోష‌ల్ మీడియా షేర్ చాట్. ఇది ఇన్ స్టంట్ న్యూస్, ఫోటోలు, వీడియోలు పంపించుకునే ప్లాట్ ఫార‌మ్. అంతే కాదు రీల్స్ కూడా చేసుకునే సౌల‌భ్యాన్ని క‌ల్పిస్తోంది. ఇదిలా ఉండ‌గా షేర్ చాట్ వాల్యూ ఇప్పుడు రూ. 40 వేల కోట్ల రూపాయలు.

పోనీ ప్రారంభించిన స‌మ‌యంలో స‌క్సెస్ రాలేదు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 17 అంకుర సంస్థ‌ల‌ను ఏర్పాటు చేశాడు అంకుష్ స‌చ్ దేవా(Ankush Sachdeva). చివ‌ర‌కు ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి లాగా షేర్ చాట్ తో అంతిమంగా విజేత‌గా నిలిచాడు. ఇది త‌న కెరీర్ లో 18వ స్టార్ట‌ప్ కావ‌డం విశేషం. జ‌న‌వ‌రి 8, 2015లో ప్రారంభించాడు. షేర్ చాట్ కో ఫౌండ‌ర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా ఉన్నాడు. మొహ‌ల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫౌండ‌ర్ కూడా.

ఇప్ప‌టి దాకా షేర్ చాట్ దాదాపు 180 మిలియ‌న్ల‌కు పైగా నెల వారీగా వినియోగ‌దారుల‌ను క‌లిగి ఉంది. ఎక్క‌డో ఘ‌జియాబాద్ లో 1992లో పుట్టిన స‌చ్ దేవా మెద‌డులో మొల‌కెత్తిన ఆలోచ‌న‌ల స‌మాహార‌మే ఈ షేర్ చాట్. క‌ల‌లు క‌న‌డ‌మే కాదు వాటిని సాకారం కూడా చేయొచ్చ‌ని ఇతడిని చూస్తే తెలుస్తుంది క‌దూ.

Also Read : Mihir Karmakar : సివిల్ స‌ర్వీసెస్ అభ్య‌ర్థుల‌కు ఆలంబ‌న‌

 

Leave A Reply

Your Email Id will not be published!