Rahul Gandhi : రాహుల్ పాద‌యాత్ర‌కు జ‌న నీరాజ‌నం

అనూహ్య స్పంద‌న అపూర్వ ఆద‌ర‌ణ

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర గురువారం ఏపీలో కొన‌సాగుతోంది. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా జ‌నం నీరాజ‌నం ప‌లుకుతున్నారు. ప్ర‌ధానంగా చిన్నారుల నుంచి వృద్దుల దాకా ఆద‌రిస్తున్నారు. అంత‌కు ముందు రాయ‌ల‌సీమలో ఎక్కువ‌గా ఆరాధించే ఆదోని లోని ల‌క్ష్మ‌మ్మ అవ్వ ఆల‌యాన్ని సంద‌ర్శించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

అమ్మ వారి ఆశీర్వాదం అందుకున్నారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఓ వృద్దురాలు రాహుల్ గాంధీతో సంభాషించ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకునేలా చేసింది. ఆమె గాంధీని ఆలింగ‌నం చేసుకుని కొద్ది సేపు మాట్లాడ‌డం, అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

రాహుల్ గాంధీ త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో క‌లిసి త‌మిళ‌నాడు లోని క‌న్యాకుమారి నుండి భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే కేర‌ళ‌, క‌ర్ణాట‌క పూర్తి చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో కొన‌సాగుతోంది. త్వ‌ర‌లోనే నారాయ‌ణ‌పేట మీదుగా తెలంగాణ‌లో పాద‌యాత్ర చేప‌డ‌తారు.

చివ‌ర‌కు కాశ్మీర్ కు చేరుకుంటారు. మొత్తం 3,750 కిలోమీట‌ర్లు 150 రోజుల పాట కొన‌సాగుతుంది ఈ పాద‌యాత్ర‌. ఇదే స‌మ‌యంలో మ‌హిళా కాంగ్రెస్ నాయ‌కురాలు రాహుల్ గాంధీని(Rahul Gandhi)  ఆశీర్వ‌దించ‌డం ప్ర‌స్తుతం హైలెట్ గా మారింది. ఇది వైర‌ల్ అవుతోంది.

ఇదే స‌మ‌యంలో రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ కు మూడు రాజ‌ధానులు అవ‌స‌రం లేద‌న్నారు. అమ‌రావ‌తి ఒక్క‌టి ఉంటే చాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం రాహుల్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ఆందోళ‌న బాట ప‌ట్టిన రైతుల‌కు టానిక్ లాగా మారాయి.

Also Read : నితీష్ బీజేపీతో చేతులు క‌లిపే ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!