Ramanujacharya : స‌ప్త‌వ‌ర్ణ శోభితం స‌మతామూర్తి కేంద్రం

భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన నిర్వాహ‌కులు

Ramanujacharya : వెయ్యేళ్ల స‌మతామూర్తి మ‌హోత్స‌వాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ప్రారంభ‌మ‌య్యాయి. రాహు కాలం త‌ర్వాత శ్రీ‌రామ‌న‌గ‌రంలో శ్రీ‌శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా చేప‌ట్టిన శోభ‌యాత్ర భ‌ఖ్త జ‌న కోటిని ఆక‌ట్టుకుంది. తాను దైవాన్ని కాన‌ని పామ‌రుడిని మాత్ర‌మేన‌ని, కుల‌, మ‌త‌, వ‌ర్గ విభేదాలు లేనే లేవ‌ని ఎవ‌రు జ్ఞానం తెలుసుకుంటారో వారే దైవ‌మ‌ని చాటి చెప్పిన మ‌హ‌నీయుడు శ్రీ రామానుజుడు(Ramanujacharya).

ఆయ‌న‌ను త‌న గురువుగా, త‌న‌కు స్ఫూర్తిగా చెబుతూ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా నేటి త‌ర‌మే కాదు రాబోయే త‌రాల‌కు స్ఫూర్తి దాయ‌కంగా ఉండేలా ఆయ‌న భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు చిన‌జీయ‌ర్ స్వామి.

216 అడుగుల ఈ విగ్ర‌హం ప్ర‌పంచంలోనే రెండోది. 316 అడుగుల‌తో బ్యాంకాక్ లో బుద్దుడి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. 45 ఎక‌రాల‌లో విస్త‌రించి ఉన్న శ్రీ‌రామ‌న‌గ‌రం ( చిన జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మం ) పూర్తిగా భ‌క్తుల‌తో నిండి పోయింది.

జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ సంద‌ర్భంగా స‌ప్త వ‌ర్ణ శోభితంతో ఆ ప్రాంగ‌ణం నిండి పోయింది. ఎటు చూసినా రెండు క‌ళ్లు స‌రిపోవు అన్న‌ట్టుగా తీర్చిదిద్దారు.

ప్ర‌ముఖ ఆర్కిటెక్టు ఆనంద్ సాయి ఆధ్వ‌ర్యంలో మండ‌పాల‌ను రూపొందించారు. ఆయ‌న ఇప్ప‌టికే యాదాద్రి ఆల‌య పున‌ర్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు.

ప్ర‌స్తుతం ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ‌తో అల‌రారుతోంది. ఈ స‌మ‌తామూర్తి మ‌హోత్స‌వాలు ఈనెల 14 దాకా నిర్వ‌హించ‌నున్నారు. మాన‌వుల్లో ప‌రివ‌ర్త‌న రావాల‌న్న‌దే త‌మ అభిమ‌త‌ని అందుకే తాము ఈ స‌మతామూర్తిని ఏర్పాటు చేశారు.

Also Read : స‌ప్త‌వ‌ర్ణ శోభితం స‌మతామూర్తి కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!