Tirumala Devotees : పోటెత్తిన భక్తజనం భారీ ఆదాయం
తిరుమలలో భారీగా భక్తుల చేరిక
Tirumala Devotees : దేవ దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ప్రతి రోజూ 75 వేల మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత ఆదివారం ఏకంగా 90 వేలకు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు.
ఇటీవలి కాలంలో టీటీడీ చరిత్రలో భారీ ఎత్తున దర్శించు కోవడం విశేషం. తండోప తండాలుగా తరలి వస్తున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి, ఏవో ధర్మారెడ్డిలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనం త్వరగా అయ్యేలా కృషి చేస్తున్నారు.
ఇక దర్శనం పరంగా చూస్తే జూన్ 13న మంగళవారం శ్రీ వేంకటేశ్వర స్వామి, అమ్మ వార్లను 75 వేల 227 మంది దర్శించుకున్నారు. 33 వేల 706 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలు, విరాళాల రూపేణా టీటీడీకి రూ. 3.85 కోట్లు లభించాయి. ఇక టోకెన్లు లేకుండా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం కనీసం 18 గంటలు పట్టే అవకాశం ఉందని (TTD) వెల్లడించింది.
భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం ప్రోటోకాల్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇస్తోంది టీటీడీ. ఇదే సమయంలో ప్రముఖులైతే తప్పా వేరే వారికి అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సామాన్య భక్తులకు సాధ్యమైనంత త్వరగా దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
Also Read : Bhatti Vikramarka : పాలన అస్తవ్యస్తం ప్రజలకు శాపం
