TTD : శ్రీవారి దర్శనం మరింత కష్టం
తిరుమలకు పోటెత్తిన భక్తజనం
TTD : తిరుమలలో కొలువై ఉన్న శ్రీవారిని దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తారు. ఇటీవల విడుదల చేసిన సర్వ దర్శనం టోకెన్లు నిమిషాల లోపే అయి పోయాయి. ఇక ఈ టికెట్ల అమ్మకం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంకు(TTD) భారీ ఎత్తున ఆదాయం లభించింది. ఏకంగా రూ. 15 కోట్లు వచ్చినట్లు సమాచారం.
ఇక సెలవులు వస్తున్నాయంటే చాలు భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. వీరిని కంట్రోల్ చేయలేక టీటీడీ సతమతం అవుతోంది. వసతి సౌకర్యాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు మరింత ఉదృతి పెరగడంతో పాటు టీటీడీకి గణనీయమైన ఆదాయం సమకూరుతోంది.
కానీ స్వామి వారికి సంబంధించిన లడ్డూ ప్రసాదం, అన్నదానం లో గతంలో ఉన్నంత నాణ్యత, రుచి లేకుండా పోయిందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇదే సమయంలో తాజాగా శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు తిరుమలకు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి పోయాయి.
దీంతో సుదూర తీరాల నుంచి పుణ్య క్షేత్రానికి వచ్చిన చిన్నారులు, పిల్లల తల్లులు నానా తంటాలు పడుతున్నారు. చివరకు శిలా తోరణం వరకు నిలిచి ఉన్నారు. దీంతో స్వామి దర్శనం కావాలంటే కనీసం 30 గంటల దాకా సమయం పడుతుందని అంచనా. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటలు పడితే, టైమ్ స్లాట్ భక్తులకు 5 గంటల సమయం పడుతుందని టీటీడీ(TTD) వెల్లడించింది.
ఇదిలా ఉండగా భారీ వర్షం కారణంగా కార్తీక వన భోజన కార్యక్రమాన్నిరద్దు చేసినట్లు పేర్కొంది.
Also Read : ఆగని వర్షం తమిళనాడు అతలాకుతలం