Jairam Ramesh : రాహుల్ యాత్రకు జన నీరాజనం – జైరాం
తెలంగాణలో పాదయాత్ర సక్సెస్
Jairam Ramesh : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలలో ముగిసిందన్నారు. శనివారం జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ యాత్రకు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. రాహుల్ చేపట్టిన యాత్ర దెబ్బకు భారతీయ జనతా పార్టీలో బుగులు మొదలైందన్నారు. విద్వేషాలతో రాజకీయాలు చేయాలని అనుకోవడం మూర్ఖత్వం అని మండిపడ్డారు జైరాం రమేష్(Jairam Ramesh).
ఇక రాహుల్ యాత్రతో పార్టీకి కొత్త జోష్ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలోని ఏడు జిల్లాల్లో పాదయాత్ర పూర్తయిందన్నారు. ఈనెల 7న మహారాష్ట్రలోకి ప్రవేశి స్తుందని చెప్పారు. ప్రధానంగా చిన్నారులు, పెద్దలు పెద్ద ఎత్తున ఆదరించారని చెప్పారు. బీజేపీ ఏం చేయాలో తెలియక నిరాధారమైన ఆరోపణలు చేస్తోందంటూ మండిపడ్డారు జైరాం రమేష్.
ఉన్నతమైన లక్ష్యం కోసం, దేశం ఏకం కావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారని కానీ ఎన్నికల కోసం మాత్రం కాదన్నారు. అటు కేంద్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని మండిపడ్డారు. ఏదో ఒక రోజు ప్రజలు ఛీకొట్టడం ఖాయమన్నారు జైరాం రమేష్(Jairam Ramesh).
వేలాది మంది విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కళాకారులు, మహిళలు, యువతీ యువకులు కలిశారని వెల్లడించారు. సామాజిక చైతన్యాన్ని తీసుకు వచ్చేలా ఈ యాత్ర కీలక పాత్ర పోషించిందన్నారు జై రాం రమేష్.
Also Read : ఉత్తరాఖండ్ లో హిందీలో మెడికల్ కోర్సులు