Rahul Gandhi : భారత్ జోడో యాత్రకు భారీ స్పందన
కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో పెరిగిన జోష్
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన జోడో యాత్రకు జనం నుంచి భారీ స్పందన లభిస్తోంది. కన్యాకుమారి నుంచి ఆ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభించారు.
పాదయాత్రలో పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆయన వెంట ఉన్నారు. 3,570 కిలోమీటర్లు 150 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల దాకా సాగుతుంది.
2024లో దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని పవర్ లోకి తీసుకు వచ్చేందుకు గాను పార్టీ ఈ యాత్రను సన్నాహకంగా భావిస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) జాతీయ జెండాను ఎగుర వేశారు.
ఆయన ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తున్నారు. అంతకు ముందు శ్రీపెరంబుదూర్ లోని తన తండ్రి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించారు.
ఘనంగా నివాళులు అర్పించారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఇ) చేసిన ఉగ్ర దాడిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.
ద్వేషం, విభజన రాజకీయాలకు నేను నా తండ్రిని కోల్పోయారు. దీని కారణంగా నా ప్రియమైన దేశాన్ని కోల్పోయేందుకు సిద్దంగా లేనని స్పష్టం చేశారు.
ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది. కలిసి మేము ముందుకే సాగుతామని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. కాగా ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ భారత్ జోడో యాత్రను ల్యాండ్ మార్క్ గా అభివర్ణించారు.
Also Read : పీపీఎఫ్ లో జమ బతుక్కి ధీమా